అసలు నువ్వంటే మంట.. సమ్‌థింగ్‌ ఏదో ఉంది.. రెడ్‌ ట్రైలర్‌

Published : Dec 24, 2020, 11:38 AM IST
అసలు నువ్వంటే మంట.. సమ్‌థింగ్‌ ఏదో ఉంది.. రెడ్‌ ట్రైలర్‌

సారాంశం

రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం `రెడ్‌`. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. ఇందులో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు గెడ్డంతో ఫస్ట్ టైమ్‌ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

`ఒక అమ్మాయితో కొంత కాలం ట్రావెల్‌ అయ్యాక, తను మనకు కరెక్టా కాదా? అనే ఓ డెసీషన్‌కి వస్తాం. లేదా నిర్ణయం తీసుకుని ట్రావెల్‌ అవుతాం. కానీ తన విషయంలో రెండూ కాదు. ఆమెని చూసిన ఫస్ట్ టైమే తెలిసిపోయింది. ఆమె నా డెస్టినేషన్‌. పర్సనల్లీ, ప్రొఫేషనల్లీ అంతా సెట్ అయిపోయిందనుకున్నా. కానీ అదే టైమ్‌లో నా లైఫ్‌లోకి.. `అంటూ వదిలేశాడు రామ్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం `రెడ్‌`. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. 

ఇందులో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు గెడ్డంతో ఫస్ట్ టైమ్‌ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో `ఒక అమ్మాయితో కొంత కాలం ట్రావెల్‌ అయ్యాక, తను మనకు కరెక్టా కాదా? అనే ఓ డెసీషన్‌కి వస్తాం. లేదా నిర్ణయం తీసుకుని ట్రావెల్‌ అవుతాం. కానీ తన విషయంలో రెండూ కాదు. ఆమెని చూసిన ఫస్ట్ టైమే తెలిసిపోయింది. ఆమె నా డెస్టినేషన్‌. పర్సనల్లీ, ప్రొఫేషనల్లీ అంతా సెట్ అయిపోయిందనుకున్నా. కానీ అదే టైమ్‌లో నా లైఫ్‌లోకి..అంటూ తాను ప్రేమించి అమ్మాయి గురించి వర్ణించాడు రామ్‌. ఆ తర్వాత తన జీవితంలోకి మరో వ్యక్తి రావడంతో చిందవందరగా తయారైందని పేర్కొన్నారు. 

అనంతరం హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌ ఎంటర్‌ అయ్యింది. ఆమె పోలీస్‌లో కనిపిస్తూ, `ఇంటర్‌ వరకే చదువుకున్న వాడికి లా గురించి అంతలా ఎలా తెలుస్తుంది` అని మండిపడుతుంది. దీనికి సత్య స్పందిస్తూ `ఇలా అవతలి వారి జీవితంలోకి తొంగిచూసే అలవాటు ఎప్పుడు పోతుందో` అని అన్నాడు మేడమ్‌ అని చెప్పడం, వాడికి ఉన్న తెలివి తేటలకు సగం సిటీని తూకం వేసి అమ్మేయగలడు.. ఏం చేస్తాం వాడికో వీక్‌నెస్‌` అని పవిత్ర చెప్పడం.. నా లైఫ్‌ని డిస్టర్బ్ చేయడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడని నాకు తెలుసు అని రామ్‌ చెప్పడం, చిన్న పాయింట్‌ ఏదో మిస్‌ అవుతుందే.. కళ్ల ముందే కదలాడుతుంది.. కానీ కనిపించడం లేదు అని నివేదా అనడం, పైకి కనిపించేంత సాఫ్ట్ ఏం కాదు వాడు..అసలు నువ్వంటే మంట.. ఈ సారి ఆ మంట మరింతగా ఉంటుందని మరో రామ్‌ చెప్పడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆద్యంతం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

అయితే ట్రైలర్‌ కొంత వరకు రెగ్యులర్‌గానే ఉన్నా, మరికొంత ఇంకా ఏదో ఉందన్న ఫీలింగ్‌ని కలిగిస్తుంది. ఇది తమిళంలో విజయం సాధించిన `తడం` చిత్రానికి రీమేక్‌. ఇందులో మాళవిక శర్మ, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్