అద్బుతమైన జానపద పాట షేర్ చేసిన పవన్..ఇదిగో

By Surya PrakashFirst Published Dec 24, 2020, 11:16 AM IST
Highlights


నిన్న  'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల  ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో  ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని  వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి'  గుర్తుకువచ్చింది) అంటూ షేర్ చేసిన పాట ఇదే.

పవన్ కళ్యాణ్ కు జానపదులు పాడుకునే పాటలంటే చాలా ఇష్టం. ఆ విషయం ఆయన గత సినిమాల్లో ఆ పాటలను వినియోగించుకుని ప్రమోట్ చేసిన తీరు చూస్తే అర్దమవుతుంది. తాజాగా ఆయన మరో జానపద పాటుకు బాగా ఇన్సైర్ అయ్యారు. వెంటనే ఆ పాటను వీడియో తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసారు.
 
నిన్న  'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల  ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో  ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని  వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి'  గుర్తుకువచ్చింది) అంటూ షేర్ చేసిన పాట ఇదే.

నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి' గుర్తుకువచ్చింది) pic.twitter.com/CkgNP3PSMA

— Pawan Kalyan (@PawanKalyan)

ఇక పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. సిల్వర్‌ స్ర్కీన్‌పై ఈ పేరు చూడడం కోసం దాదాపు రెండేళ్లుగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించిన పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాత రాజకీయాలపై దృష్టి సారించి వెండితెరకు కొంతకాలంపాటు దూరంగా ఉన్నారు. అయితే ఆయన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంతో వెండితెరపై మరోసారి సందడి చేయనున్నారనే మాట విని అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

కరోనా వైరస్‌ విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా షూటింగ్స్‌ ఆగిపోయాయి. సినిమా రిలీజ్‌లు కూడా వాయిదా పడ్డాయి. అలా మే 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రానికి బ్రేక్‌ పడింది. దీంతో పవన్‌ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే సంక్రాంతికి ఈ సినిమా ధియోటర్స్ వచ్చే అవకాసం ఉందని వార్తలు వస్తూండటంతో ఆనందోత్సాహాలలో ఉన్నారు. 

అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌’. ఈ చిత్రానికి రీమేక్‌గానే ‘వకీల్‌ సాబ్‌’ను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌, దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ మధ్యన విడుదలైన ఈ సినిమాలోని ‘మగువా మగువా’ అనే పాట ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

click me!