టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘రెడీ’ రీరిలీజ్ కు సిద్ధం అవుతోంది. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి తెలిసిందే. కేరీర్ ప్రారంభంలో చాక్లెట్ బాయ్ గానూ గుర్తింపు దక్కించుకున్నారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ రామ్ పోతినేని కూడా ఒకరు. ప్రస్తుతం మాస్ చిత్రాలపై ఫోకస్ పెట్టిన రామ్ అప్పట్లో రొమాంటిక్ అండ్ ఫ్యామిటీ ఎంటర్ టైనర్లలో నటించిన హిట్లు సాధించిన విషయం తెలిసిందే. అందులో ‘రెడీ’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రామనే చెప్పాలి.
ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల పుట్టిన రోజున వారి కేరీర్ లోని బ్లాక్ బాస్టర్ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ పోతినేని ఫ్యాన్స్ కు కూడా గుడ్ న్యూస్ అందించింది. మే 15 రామ్ బర్త్ డే ఉండటంతో Ready చిత్రాన్ని రీరిలీజ్ కు సిద్ధం చేశారు. 4కే క్వాలిటీతో థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రామ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. రామ్ కేరీర్ లో బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రామ్ పోతినేని - జెనిలియా జంటగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఎంఎస్ నారాయణ, నాజర్, బ్రహ్మానందం, షఫీతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఆయా పాత్రల్లో అలరించారు.
తెలుగులో బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచిన ఈ చిత్రం ఆయా భాషల్లోనూ రీమేక్ అయ్యింది. 2009లో కన్నడలో ‘రామ్’గా, 2010లో తమిళంలో ‘ఉత్తమ పుదిరన్’గా, ఇక హిందీలోనూ 2011లో ‘రెడీ’ టైటిల్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి రాబోతుంటడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. రీరిలీజ్ ను విజయవంతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
మాస్ అండ్ యాక్షన్ ఫిల్మ్స్ ను ఎక్కువగా ఇష్టపడే రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinivas) దర్శకత్వంలో Boyapati Rapoలో నటిస్తున్నారు. శ్రీలీలా కథానాయిక. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత చిత్తూరి శ్రీనివాస నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 20న పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.
Get READY, Once Again !🔥
USTAAD 's is Re-Releasing on May 14th 😍 💥
Stay Tuned. More Updates Soon 🤟 pic.twitter.com/72hOc6BBcD