రామ్ పోతినేని వీరాభిమాని.. కొడుకు పుట్టాడని అలా చేశాడు.. ఫిదా అయిన ఉస్తాద్..

ఉస్తాద్, రామ్ పోతినేని అభిమాని ఒకరు ఊహించని విధంగా సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఫ్యాన్ చూపించిన ప్రేమకు రామ్ ఫిదా అయ్యాడు. తాజాగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 


స్టార్ హీరోలు, సెలబ్రెటీలకు ఫ్యాన్స్ ఉండటం సర్వసాధారణమే. కొందరు కొందరు హీరోలకు మాత్రమే డైహార్ట్ ఫ్యాన్స్, అమితంగా అభిమానించే వారు ఉంటారు. అప్పుడప్పుడు, కొన్ని ప్రత్యేకమైన సందర్భంగాల్లో తమ అభిమాన హీరోపై ప్రేమను చూపిస్తుంటారు. పలురకాలుగా అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా రామ్ పోతినేని (Ram Pothineni) అభిమాని ఒకరు ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేశారు. అందుకు రామ్ కూడా ఫిదా అవుతూ స్పందించారు. ఇంతకీ జరిగిందేంటంటే..

హరిహర అనే రామ్ పోతినేని అభిమానికి ఇటీవల కొడుకు పుట్టాడు. ఆయన రామ్ కు వీరాభిమాని. కాగా, నేమింగ్ సెరెమనీ కార్యక్రమంలో తన కొడుకు స్కంద అని పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు  రామ్ పోతినేని నెక్ట్స్ సినిమా పేరు కావడం విశేషం. ఈ విషయాన్ని హరిహర స్నేహితుడు ట్వీటర్ లో పోస్ట్ చేశారు. అదికాస్తా ఉస్తాద్ వరకు చేరింది. దీంతో వెంటనే హార్ట్ టచ్చింగ్ మూమెంట్ అంటూ రిప్లై చేశారు. 

Latest Videos

రామ్ పోతినేని రిప్లై ఇస్తూ.. ‘నను హత్తుకున్నావు. ఆ భగవంతుడు స్కంద ఆశీస్సులు ఎప్పటికీ కచ్చితంగా అతనికి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులకు దేవుడి దీవెనలు ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ పేర్కొన్నారు. అభిమానికోసం ఓ రెడ్ హార్ట్ నూ వదిలారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 

‘స్కంద’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ సెప్టెంబర్ 28న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్ పోతినేని శ్రీలీలా జంటగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకోనుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రిన్ బ్యానర్ పై రూపుదిద్దుకుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. 

I’m so touched..I’m sure the blessings of lord Skanda will always be with him.. God bless you & your family.. ❤️ https://t.co/66uYUZtwVc

— RAm POthineni (@ramsayz)
click me!