ఏ గొట్టం నా***కి సమాధానం చెప్పను.. తనపై ట్రోలింగ్, బ్రో సాంగ్ రెస్పాన్స్ పై తమన్ ఘాటుగా..

Published : Jul 10, 2023, 05:44 PM IST
ఏ గొట్టం నా***కి  సమాధానం చెప్పను.. తనపై ట్రోలింగ్, బ్రో సాంగ్ రెస్పాన్స్ పై తమన్ ఘాటుగా..

సారాంశం

ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా స్టార్ హీరోల చిత్రాలు చేసే అవకాశాలు తమన్ కి వస్తున్నాయి.  ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంటే ఆడియన్స్ ముందుగా తమన్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా స్టార్ హీరోల చిత్రాలు చేసే అవకాశాలు తమన్ కి వస్తున్నాయి.  ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంటే ఆడియన్స్ ముందుగా తమన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎంత ట్రోలింగ్ ఎదురైనా ప్రతి సారీ తమన్ తన మ్యూజిక్ తో సమాధానం ఇస్తున్నాడు. 

రీసెంట్ గా తమన్ సంగీతం అందించిన పవన్ కళ్యాణ్, తేజు బ్రో చిత్రం నుంచి మై డియర్ మార్కండేయ అనే సాంగ్ రిలీజయింది. అయితే ఫ్యాన్స్ లో ఈ సాంగ్ ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదు. త్వరలో జూలై 28న ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో తమన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. 

నేడు మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో తమన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. బ్రో చిత్రంలోని సాంగ్ కి వస్తున్న మిక్స్డ్ రెస్పాన్స్ పై స్పందించారు. నిజమే మిక్స్డ్ రియాక్షన్ వస్తోంది. వాస్తవంగా అది తేజు సాంగ్. ఆ పాటలోకి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అందువల్ల అంచనాలు భారీగా పెట్టుకుంటే ఏమీ చేయలేం. 

ఆ కథకి ఎలాంటి పాట కావాలో అదే పెట్టాం. ఆ సందర్భానికి అలాంటి పాట పెడితేనే బావుంటుంది అని తమన్ తెలిపారు. సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న కామెంట్స్ పై కూడా తమన్ రియాక్ట్ అయ్యారు. క్రికెట్ మీద ఉన్న శ్రద్ద తమన్ కి మ్యూజిక్ పైన లేదు అంటూ ట్రోల్ చేసేవారికి తమన్ ఘాటుగా బదులిచ్చారు. 

నాకు మద్యం అలవాటు లేదు.. నాకు గర్ల్ ఫ్రెండ్స్ లాంటి వ్యవహారాలు లేవు. నాకున్న ఒకే ఒక్క వినోదం క్రికెట్. రాత్రి 9 గంటలకు వెళ్లి క్రికెట్ ఆడుతా. కానీ పని వదిలిపెట్టి నేను ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. అలా చేశానని ఒక్క డైరెక్టర్, ఒక్క నిర్మాత కూడా నాపై ఫిర్యాదు చేయలేదు. నేను నా పనిపై ఎంత శ్రద్ద పెడతానో అందరికి తెలుసు.. కాబట్టి ఇక్కడ నేను ఏ గొట్టం నా కొడుక్కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఘాటుగా ఫైర్ అయ్యారు.  

PREV
click me!

Recommended Stories

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్