‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో మరోసారి వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా సత్తా చాటిన దర్శకధీరుడు రాజమౌళి.. ‘మహాభారతం’ మూవీని తెరకెక్కించబోతున్నారనే విషయం తెలిసిందే. ఇంతకీ ఎప్పుడు ప్రారంభం కానున్నదనే దానిపై తాజాగా విజయేంద్ర ప్రసాద్ అప్డేట్ అందించారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సినిమాల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో జక్కన్న క్రియేట్ చేసిన సెన్సేషన్ కు నెక్ట్స్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం జక్కన్న గురి సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) తో తెరకెక్కించనున్న SSMB28పై ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదోక యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’పైనా ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఉంది. దీనిపై జక్కన్న ఆయా ఇంటర్వ్యూల్లో స్పందించారు. మహాభారతం తెరకెక్కించాలంటే హ్యూజ్ టెక్నాలజీ, టెక్నీకల్ టీమ్ అవసరమని తెలిపారు. పైగా తనకు ఇంకాస్తా సమయం అవసరమని కూడా చెప్పారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై ఆడియెన్స్ లో స్పష్టత లేకపోయింది.
కానీ తాజాగా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ (vijayendra Prasad) బిగ్ అప్డేట్ అందించారు. లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో Mahabharatam సినిమాపై స్పందించారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతుందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. మహేశ్ బాబు సినిమా పూర్తయ్యాక ‘మహాభారతం’ సినిమానే ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ముందు వస్తాయన్నారు.
మహాభారతంలో టాలీవుడ్ స్టార్ తో పాటు బాలీవుడ్ ప్రముఖ నటీనటులను కూడా జక్కన్న ప్రధాన పాత్రల కోసం తీసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ
స్కేల్ లో ఈ చిత్రాన్ని పార్ట్ లుగా చిత్రీకరిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక మహేశ్ బాబు సినిమా పూర్తైతే గానీ ఈ ప్రాజెక్ట్ వివరాలు వచ్చే అవకాశం లేదు. త్వరలోనే SSMB29 మూవీ కూడా అధికారికంగా ప్రారంభం కానుంది.