Ram Pothineni : మాస్ లుక్ లో అదిరిపోయిన ‘రామ్’.. ఫొటోలను షేర్ చేస్తున్న ఫ్యాన్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 24, 2022, 03:24 PM IST
Ram Pothineni : మాస్ లుక్ లో అదిరిపోయిన ‘రామ్’.. ఫొటోలను షేర్ చేస్తున్న ఫ్యాన్స్

సారాంశం

ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని మాస్ లుక్ లో అదరగొడుతున్నాడు. రామ్ పోతినేని తన నెక్ట్స్ మూవీలో పోలీస్ గా కనిపించినున్నారు. ఈ సందర్భంగా షూటింగ్ కొనసాగుతోంది.    

రామ్ పోతినేని, దర్శకుడు లింగు స్వామి కామినేషనల్ లో తెరకెక్కుతున్న మూవీ ‘వారియర్’. ఈ మూవీలో రామ్  మాస్ లుక్ లో అభిమానుల మతి పోగోడుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో  మాస్ యాక్షన్ చూపించబోతున్నాడు రామ్ పోతినేని (Ram Pothineni). దాని కోసమే సెకండ్ టైమ్ సిక్స్ ప్యాక్ చేశారట. లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.

అయితే, ఉస్తాద్ రామ్ 19వ చిత్రం ‘వారియర్’ షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తోంది వారియర్ టీం. ఈ సందర్భంగా రామ్ షూటింగ్ ముగించుకొని వెళ్తుండగా అభిమానుల కోసం ఫొటోలకు ఫోజులిచ్చాడు. ట్రెండీ షర్ట్ లో తన కట్ అవుట్ చూపిస్తూ అదరగొట్టాడు రామ్. ఈ ఫొటోల్లో సివిల్ డ్రెస్ లో తిరుగుతున్న పోలీస్ లా కనిపిస్తున్నాడని పలువురు అభిమానులు కొనియాడుతున్నారు.

 

ప్రస్తుతం ఈ ఫొటోలను రామ్ పోతినేని అభిమానులు సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. రామ్ ను ఢిపరెంట్ లుక్ లో చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారీ రామ్ మరోట్రెండ్ తో రానున్నాడంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో రామ్ కి చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉంది. యూత్ లో ఆయనకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి రామ్  తన రూట్ ను చేంజ్ చేసి మాస్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్నాడు. అందులో బాగంగానే ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) సినిమాలో మాస్ లుక్ తో  కనిపించాడు. పూరీ జగన్నాథ్(Puri Jagannath) డైరెక్ట్ చేసిన ఈ మూవీ సక్సెస్ తో అనుకున్నది సాధించాడు రామ్.

ఆ తరువాత వచ్చిన రెడ్(Red)మాత్రం రామ్(Ram Pothineni) కు నిరాశే మిగిల్చింది.   రెడ్(Red) రామ్ కు వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు తాను ది వారియర్ సినిమాను చేస్తున్నాడు. లింగుసామి డైరెక్షన్ లో తెరకెక్కుతోందీ చిత్రం. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోస్టర్ తో రామ్ అభిమానుల మనస్సు దోచుకున్నాడు.  కాగా, క్యూట్ బేబీ కృతి శెట్టి రామ్ సరసన అలరించనుంది.  
యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా