Vaisshnav Tej:బటర్ ఫ్లై కిస్ ఏంటో తెలుసా మీకు..ఇదిగో ఇలా

Surya Prakash   | Asianet News
Published : Jan 24, 2022, 01:36 PM IST
Vaisshnav Tej:బటర్ ఫ్లై కిస్ ఏంటో తెలుసా మీకు..ఇదిగో ఇలా

సారాంశం

 'ఏంటే.. ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్?'  అని వైష్ణవ్ అడగ్గా.. 'అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏమి తీసుకురానక్కర్లేదు తెలుసా..' అని కేతిక చెబుతుంది.  


మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ జంటగా  ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ రెడీ అవుతోంది. బీ.వీ.యస్.యన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రంకి ‘రంగరంగ వైభవంగా’.. అనే క్లాసీ టైటిల్‌ను ప్రకటిస్తూ నిర్మాతలు ఓ టీజర్ విడుదల చేశారు.  ‘అర్జున్‌రెడ్డి’ తమిళ వెర్షన్ ను తెరకెక్కించిన గిరీశయ్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 'ఏంటే.. ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్?'  అని వైష్ణవ్ అడగ్గా.. 'అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏమి తీసుకురానక్కర్లేదు తెలుసా..' అని కేతిక చెబుతుంది.

ఈ క్రమంలో 'నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా..' అని హీరోయిన్ అంటుంటే.. తమ కను రెప్పలను తాకిస్తూ ముద్దు పెట్టుకోవడంతో ఇద్దరి ఫేస్ లను రివీల్ చేశారు. ఎలా ఉందని కేతిక అడుగగా.. నెక్స్ట్ లెవెల్ లో ఉందని వైష్ణవ్ చెప్పడం ''రంగ రంగ వైభవంగా'' టైటిల్ టీజర్ లో కనిపించింది.  కొద్ది సేపటి క్రితమే విడుదలైన ఈ టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఉప్పెన’తో టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మూడో చిత్రంగా విడుదవుతోంది ‘రంగరంగ వైభవంగా’. రొమాంటిక్, లక్ష్య చిత్రాలతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కేతికా శర్మకి కూడా ఇది మూడో చిత్రం అవడం విశేషం. మరి వీరి ప్రేమకథ.. పేరుకు తగ్గట్టుగానే ‘రంగరంగ వైభవంగా’ ఉంటుందేమో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా