మంచి టైమ్ రామ్.. ఇప్పుడైనా హిట్టందుకోవయ్యా?

By Prashanth MFirst Published Oct 6, 2018, 5:46 PM IST
Highlights

సాధారణంగా కుర్ర హీరోలు అభిమానుల్లో మంచి క్రేజ్ అందుకున్నప్పటికీ కొన్ని సినిమాల తరువాత ఫెడవుట్ అయిపోతున్నారు. మంచి కథలను ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేసరికి డిజాస్టర్స్ ఎక్కువగా అందుకోవడం కామన్ అయ్యింది.

సాధారణంగా కుర్ర హీరోలు అభిమానుల్లో మంచి క్రేజ్ అందుకున్నప్పటికీ కొన్ని సినిమాల తరువాత ఫెడవుట్ అయిపోతున్నారు. మంచి కథలను ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేసరికి డిజాస్టర్స్ ఎక్కువగా అందుకోవడం కామన్ అయ్యింది. ఇకపోతే లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామ్ కెరీర్ లో విజయలకంటే అపజయాలనే ఎక్కువగా చూశాడు.

అయినప్పటికీ రామ్ తన మార్కెట్ ను వీలైనంత వరకు సేఫ్ జోన్ లో సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక బిగ్గెస్ట్ హిట్ అందుకోగానే వరుసగా ఫ్లాప్స్ రావడం కెరీర్ మొదటి నుంచి ఆనవాయితీగా వస్తోంది.  నేను శైలజా సినిమాతో ఐదేళ్ల పరాజయాల నుంచి బయటపడ్డ రామ్ ఆ తరువాత ఏడాది మరోసారి తడబడ్డాడు. హైపర్ సినిమాతో పాటు నేను శైలజ దర్శకుడితో చేసిన ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. 

ఇకపోతే ప్రస్తుతం రామ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ హలొ గురు ప్రేమ కోసమే.. త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వంలోకి వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా దిల్ రాజు సినిమాని నిర్మిస్తుండడం కలిసొచ్చే అంశం. ఇప్పటికే టీజర్ తో అనుపమ నడుమందాలు కుర్రకారును తెగ ఆకర్షించాయి. అక్టోబర్ 18న సినిమాను విడుదల చెయ్యాలని దిల్ రాజు ఒక నిర్ణయానికి వచ్చారు. దసరా మూమెంట్ కాబట్టి ఇదే కరెక్ట్ టైమ్. అరవింద సమేత ఓ వారం ముందుగానే వస్తుంది. దీంతో రామ్ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా హిట్ అందుకుంటాడని చెప్పవచ్చు. 

click me!