
బాలీవుడ్ లో ఎంత మంది కపుల్స్ ఉన్నప్పటికీ అభిషేక్ బచ్చన్ జోడి వచ్చింది అంటే కెమెరాలన్నీ అటువైపు తీరుగుతాయి. అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యా రాయ్ కి సంబందించిన వార్తలు వారానికోటి నిత్యం ఇంటర్నెట్ లో వైరల్ అవుతూనే ఉంటాయి. వారు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని గొడవలు జరుగుతున్నాయని బాలీవుడ్ లో గాసిప్స్ చాలా వచ్చాయి.
అయితే బచ్చన్ కపుల్స్ వాటిని ఎక్కువగా పట్టించుకోరు. ఇటీవల ఐశ్వర్య రాయ్ కు చాలా పొగరాని.. అభిషేక్ ఆమెతో వేగలేకపోతున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో కథనాలపై అభిషేక్ స్పందించక తప్పలేదు..ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ.. వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ అబద్దాలే అంటూ తన ప్రేమ గురించి తెలియజేశాడు.
ఐశ్వర్యతో నా కెరీర్ మొదట్లోనే పెద్దగా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాల్సి వచ్చింది. మా ఇద్దరి మొదటి చిత్రం ‘ధాయి అక్షర్ ప్రేమ్‌కే’. అప్పుడు మా మధ్య స్నేహం ఏర్పడింది. ‘కుచ్ న కహో’ సినిమా స్నేహాన్ని మరింత బలపరిచింది. ఇక ‘ఉమ్రా జాన్’ సినిమాతో స్నేహం ప్రేమగా మారింది. ముందుగా నేనే ప్రపోజ్ చేశాను. పెళ్లి చేసుకున్నాం.
ఆరాధ్య జన్మించిన అనంతరం మా లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేసింది అంటూ ఐశ్వర్య ఒక తల్లిగా నటిగా తన పనికి అంకితమవుతోందని చెప్పాడు. అదే విధంగా తన భార్య ఒక సూపర్ వుమెన్ అంటూ అభిషేక్ వర్ణించాడు. ఈ బ్యూటిఫుల్ కపుల్స్ త్వరలో గులాబ్ జామున్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.