The Warriorr Collections: ది వారియర్ 3 డేస్ కలెక్షన్స్... టార్గెట్ కి చాలా దూరంలో రామ్!

Published : Jul 17, 2022, 02:21 PM ISTUpdated : Jul 17, 2022, 02:22 PM IST
The Warriorr Collections: ది వారియర్ 3 డేస్ కలెక్షన్స్... టార్గెట్ కి చాలా దూరంలో రామ్!

సారాంశం

ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ హిట్ కొట్టిన రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్. తెలుగు, తమిళ భాషల్లో భారీగా విడుదలైన ఈ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ చూద్దాం..   

టైర్ టు హీరోల్లో రామ్ కి ఓ ఇమేజ్ ఉంది. ఒకప్పుడు ఈయన మొదటి స్థానంలో ఉండేవారు. రామ్ వరుస ప్లాప్స్ తో వెనుకబడగా నాగ చైతన్య, నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ముందుకొచ్చి ఆయన్ని రేసులో వెనక్కి నెట్టేశారు. అయితే 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మూవీతో రామ్ మరలా ఫార్మ్ లోకి వచ్చాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ రూ. 34 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలు పంచింది. 

ఇస్మార్ట్ శంకర్ హిట్ నేపథ్యంలో రామ్(Ram Pothineni) తమిళ హిట్ రీమేక్ రెడ్ చేశారు. రామ్ డ్యూయల్ రోల్ చేయగా ఈ మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అనంతరం కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామితో రామ్ ది వారియర్(The Warriorr) మూవీ చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో విషయం లేదని, పాత చింతకాయ పచ్చడని క్రిటిక్స్ ప్రేక్షకులు తేల్చేశారు. అయితే ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ వర్క్ అవుట్ కావడంతో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. 

ఇక రూ. 40 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ చేసిన ది వారియర్(The Warriorr Collections) తెలుగు రాష్ట్రలో రూ. 35 కోట్లకు అమ్ముడు పోయింది. మరి భారీ టార్గెట్ తో దిగిన వారియర్ మూడు రోజుల్లో 30 శాతం రికవరీ సాధించింది. మూడు రోజులకు ఏపీ/తెలంగాణాలో కలిపి రూ. 12.27 కోట్ల షేర్ సాధించినట్లు కొన్ని వెబ్ సైట్స్ రిపోర్ట్ చేస్తున్నారు. వారి లెక్కల ప్రకారం ఫస్ట్ డే రూ. 7.02, సెకండ్ డే రూ. 2.53, మూడవ రోజు రూ. 2.71 కోట్ల వసూళ్లు వచ్చాయి. 

వీకెండ్ లో చివరి రోజు ఆదివారం మరో రెండు మూడు కోట్లు రాబట్టినప్పటికీ ది వారియర్ టార్గెట్ చాలా దూరంలో ఉంది. ఈ మూవీ లాంగ్ రన్ థియేటర్స్ లో కొనసాగితే తప్ప బ్రేక్ ఈవెన్ కి చేరే అవకాశం కలదు. లేదంటే ది వారియర్ భారీ నష్టాలు మిగల్చడం ఖాయం. ది వారియర్ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించారు. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా