
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎప్పుడూ కూల్ గా ఉంటారు. కానీ తొలిసారి దిల్ రాజు 'థాంక్యూ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్ ని గుర్తు చేసుకుంటూ ఎదుగుదలకి సహకరించిన వారందరికీ థాంక్యూ చెప్పాడు. ఈ క్రమంలో దిల్ రాజు తన దివంగత భార్య అనితని కూడా గుర్తు చేసుకున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. నేను మొదట ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ తో కెరీర్ మొదలు పెట్టాను. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా సినిమాల్లోకి అడుగుపెట్టాను. నేను నిర్మాత అయినా మొదటి చిత్రం 'దిల్'తోనే హిట్ ఇచ్చిన వివి వినాయక్ గారికి థాంక్యూ.
నా నిర్మాణంలో నటించిన అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య అందరికి థాంక్యూ. ఆ లైఫ్ లో ఒడిదుడుకులు ఉన్న సమయంలో తోడుగా ఉన్న నా భార్య అనితకి థాంక్యూ అని దిల్ రాజు వేదికపై తెలిపారు.
దిల్ రాజు స్టార్స్ అందరి పేర్లు చెప్పడంతో ఆడిటోరియం మోతెక్కిపోయింది. ఇక నాగ చైతన్య ఫాన్స్ పదే పదే మాస్ మూవీ కావాలి అని అరుస్తుండడంతో దిల్ రాజు స్పందించారు. నాగ చైతన్యతో నెక్స్ట్ మాస్ మూవీ ప్లాన్ చేస్తున్నాం అని రివీల్ చేశాడు. దిల్ రాజు కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.