ఉస్తాద్ రామ్ పోతినేని లేటెస్ట్ ఫిల్మ్ ‘డబుల్ ఇస్మార్ట్’ Double Ismart. ఈ చిత్రం కోసం రామ్, పూరీ ఫ్యాన్స్ యామ వెయిటింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఫస్ట్ అప్డేట్ ఎప్పుడు రాబోతుందని ఎదురుచూస్తున్నారు. తాజాగా బజ్ క్రియేట్ అయ్యింది.
రామ్ పోతినేని Ram Pothineni - పూరీ జగన్నాథ్ Puri Jagannath కాంబినేషన్ లో గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’ వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బాస్టర్ హిట్ గానూ నిలిచింది. దీంతో పూరీ జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చారు. ‘లైగర్’తో దెబ్బైపోయినా... మళ్లీ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ ను అనౌన్స్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం వీరి కాంబోలో ‘డబుల్ ఇస్మార్ట్’ Double Ismart శరవేగంగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, రామ్ పోతినేని లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నార్మల్ ఆడియెన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే, ఇటీవల ఈ మూవీ నుంచి పెద్దగా ఎలాంటి అప్డేట్స్ మాత్రం అందలేదు. రామ్ పోతినేని మాత్రం తన బాడీని చూపిస్తూ ఆ మధ్య ఓ ఫొటోను పంచుకున్నారు. ఫ్యాట్ మొత్తం కరిగించి సిక్స్ ప్యాక్ తో అదరగొట్టారు. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అసలైన అప్డేట్ ఎప్పుడు రానుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇలోగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ అయితే క్రియేట్ అయ్యింది.
పూరీ జగన్నాథ్ టీమ్ త్వరలోనే అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మహాశివరాత్రి Maha Shivarathri స్పెషల్ గా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం. మరోవైపు ఈ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ Mani Sharma మ్యూజిక్ అందిస్తుండటం విశేషంగా మారింది. శివరాత్రికి ఒకవేళ అప్డేట్ వస్తే మణిశర్మ ఎలాంటి సాంగ్ ను ఇవ్వబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ప్రస్తుతం ఆ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ‘డబుల్ ఇస్మార్ట్’కు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచేసింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ Sanjay Dutt విలన్ పాత్ర పోషిస్తున్నారు. 2024 మార్చి 8న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.