ఈమధ్య సౌత్ సినిమాలు ఎక్కువగా చేసేస్తోంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా. స్టార్ హీరోల సరసన స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపిస్తోంది. అందుకోసం భారీగా పారితోషికం కూడా డిమాండ్ చేస్తుంది బ్యూటీ. తాజాగా తెలుగులో మరో ఆఫర్ కొట్టేసింది.
బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా మస్త్ క్రేజ్ ఉంది ఊర్వశి రౌతేలాకి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్స్ సాంగ్స్ తో మెరిపించి మురిపిస్తుంటుంది బ్యూటీ. ఈమధ్య ఎందుకో సౌత్ మీద కాంన్సంట్రేషన్ చేసింది. ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ, స్పెషల్ సాంగ్స్ ద్వారానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది ఊర్వశీ.. బాలీవుడ్ లో ఆమె నిజంగా ఊర్వసిలాగే ట్రీట్ చేస్తారు ఆడియన్స్..
అయితే ఎంత స్పెషల్ సాంగ్స్ చేస్తున్నా.. హీరోయిన్ల కంటే కూడా ఎక్కువగా పారితోషికం అందుకుంటుంది బ్యూటీ. స్పెషల్ సాంగ్స్ కు కూడా భారీగా డిమాండ్ స్తుంది. దాంతో ఆమె డిమాండ్ కు తగ్గట్టుగానే ఎక్కువ అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. అందువల్లనే ఊర్వశి స్పెషల్ సాంగ్స్ కి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. ఊర్వశి మంచి డాన్సర్ .. ఫిట్ నెస్ ఆమె సొంతం. హాట్ .. హాట్ గా అందాలను ఆరబోయడంలో ఎంతమాత్రం మొహమాటం లేకపోవడం ఆమె ప్రత్యేకత.
తెలుగులో వాల్తేర్ వీరయ్య .. ఏజెంట్ ... బ్రో ... స్కంద సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ లో ఆమె యూత్ నుమాస్ ను ఊపేసింది. అలాంటి ఊర్వశి రౌతేలా బాలకృష్ణ - బాబీ కాంబినేషన్లోని సినిమాలో ఒక హీరోయిన్ గా కనిపించనుందనే టాక్ వినిపించింది. అది నిజమేననే విషయాన్నిఆమెనే స్పష్టం చేసింది. ఈ సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టుగా ఇన్ స్టా ద్వారా చెప్పింది. దాంతో ప్రస్తుతం ఈన్యూస్ వైరల్ అవుతోంది. ఇక ఈసినిమాను సితార బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.