Latest Videos

రామ్ 'డబుల్ ఇస్మార్ట్' బడ్జెట్…ఇన్ని కోట్లా ,షాకింగ్ !!

By Surya PrakashFirst Published May 27, 2024, 1:18 PM IST
Highlights

డబుల్ ఇస్మార్ట్ సినిమాతో హిట్ కొట్టాలని పూరి జగన్నాథ్-రామ్ కసిగా ఉన్నారు. 


 రామ్ పోతినేని(Ram Pothineni) నుండి వస్తున్నప్రతిష్టాత్మక చిత్రం  డబల్ ఇస్మార్ట్(Double Ismart).తెలుగులో డైనమిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్(Puri Jagannadh) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dut)విలన్గా  చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ టీజర్ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.పూరి మార్క్ లెవల్లో డైలాగ్స్ అదిరిపోయాయనే చెప్పాలి. దిమాక్ కిరి కిరి.. అంటూ మరోసా తన మార్క్ డైలాగ్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. 

  'కిరాక్ పొరొస్తే సైట్ మార్..ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ప మార్.. నాక్ తెల్వకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గు..కాలుతది..ఒక్కొక్కని మొలకి లడీ కడ్తా..గ్రానెట్ గుచ్చి పిన్ను పిక్తా..అంటూ రామ్ మాస్ ని చూపించాడు పూరీ..  ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ మొదలైంది. ఈ నేపధ్యంలో బడ్జెట్ గురించి హాట్ టాపిక్ గా మారింది.  

ఈ  సినిమా కన్నా ముందు పూరీ జగన్నాథ్ మరియు రామ్ లు ఇద్దరికీ కూడా ఫ్లాఫ్స్  రావటంతో  ఆ ఇంపాక్ట్ డబుల్ ఇస్మార్ట్ పై పడుతుంది అనుకున్నారు.  ఈ సారి భారీ బడ్జెట్ తో సీక్వెల్ రూపొందుతుంది అని తెలుస్తోంది…ఆల్ మోస్ట్ సినిమా కోసం ఇప్పుడు 65-70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని వినిపిస్తోందిన, స్టార్ కాస్ట్ కి రెమ్యునరేషన్ ల కింద ఎక్కువ అమౌంట్ వెళ్ళింది అంటున్నారు.  అయితే  నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి రేటుకి అమ్మారని కాబట్టి నో ప్లాబ్లం అంటన్నారు.  

డబుల్ ఇస్మార్ట్ సినిమాతో హిట్ కొట్టాలని పూరి జగన్నాథ్-రామ్ కసిగా ఉన్నారు. ఇంట్రెస్టింగ్‌గా వీరిద్దరి లాస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్‌యే కావడం విశేషం.  రామ్ చివరిగా స్కంద సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. గత ఏడాది రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్‌ను అనుకున్నతంగా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు పూరి జగన్నాథ్ చివరిగా లైగర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించారు. విజయ్ దేవరకొండతో చేసిన ఈ సినిమాతో ఫ్లాప్ అయింది.

'పూరి కనెక్ట్స్' బ్యానర్‌పై హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.  ఈ సారి ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.   ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా పూరీ ముంబైలో డబుల్‌ ఇస్మార్ట్‌ క్లైమాక్స్ ఫైట్ సీన్‌ ప్లాన్ చేశాడని..ఈ సీన్‌ కోసం ఏకంగా రూ.7 కోట్లు పెడుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆలీ, కావ్య థాపర్‌, షియాజీ షిండే, ఉత్తేజ్, గెటప్ శీను త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌కపాత్ర‌లు పోషిస్తున్నారు.

click me!