
ఏపీలో టికెట్ రేట్ల విషయంలో హడావిడి చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)... మరో సెన్సేషనల్ ట్వీల్ చేశారు. ఈ సారి రాజమౌళి ట్రిపుల్ ఆర్ ను ఉదాహరణగా తీసుకుని.. ఏపీ ప్రభుత్వానికి కౌంటర్ వేశారు వర్మ.
ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. వాదనలు.. ప్రతివాదనలతో సీన్ హీట్ ఎక్కిపోతుంది. ఈ మధ్యలో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) రాయబారాలు.. వర్మ సోషల్ మీడియా ట్వీట్లతో హడావిడి మాత్రం గట్టిగానే నడుస్తుంది. కాని.. వ్యావహారం మాత్రం ఎటూ తేలడం లేదు. ఈ ఇష్యూ మీదనే ఏపీ మంత్రి పేర్ని నానిని కలిసి మాట్లాడారు వర్మ. అటు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తుంది.
రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కూడా టికెట్ రేట్ల వ్యావహారంలో రోజుకో ట్వీట్ తో కొత్త పాయింట్స్ కు తెర లేపుతున్నారు. హీరోల రెమ్యూనరేషన్లకు.. టికెట్ రేట్లకు ముడి పెట్టవద్దు అంటున్న వర్మ...ఇండస్ట్రీ వైపు నుంచి ప్రభుత్వంతో గగ్గిగానే వాదిస్తున్నారు. ఇక మరో సారి ఏపీ ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). ఇతర రాష్ట్రాలతో పోలిక పెడుతూ.. టికెట్ రేట్ల గురించి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు రాము.
నార్త్ స్టేట్స్ లో ఐమాక్స్,ఐనాక్స్ లలో టికెట్ రేట్లు 2200 వరకూ ఉన్నాయి అన్నారు. ఈ విషయంలో ట్రిపుల్ ఆర్ ను ఉదాహరణగా తీసుకున్న రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)... నార్త్ స్టేట్ మహారాష్ట్రాలో.. రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాకు 2200 రూపాయల వరకూ టికెట్ రేటు పెంచుకునేందుకు పర్మీషన్ ఇచ్చారని... కాని ఈ సినిమాకు సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం.. ఇదే ట్రిపుల్ ఆర్ సినిమాకు కనీసం 200 కూడా పెంచుకునే వీలు లేకుండా చేశారన్నారు. ఈ రకంగా చూసుకుంటే సినిమాను ఎవరు చంపస్తున్నారు అనేది అర్ధం అవుతుంది అని అన్నారు.
సినిమా టికెట్ల విషయంలో మొదటి నుంచి పట్టుదలగా ఉన్నారు వర్మ. స్టార్ హీరోలు కూడా ఏం మాట్లాడలేని పరస్థితుల్లో ఉండగా.. వర్మ మాత్రం దీనిపై పోరాడుతున్నారు. ప్రభుత్వానికి 10 ప్రశ్నలు వేసిన వర్మ.. తన పోరాటం ఇండస్ట్రీ మంచి గురించే అంటున్నారు. అనూహ్యంగా రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు మెగా ఫ్యామిలీ నుంచి, మెగా బ్రదర్ నాగబాబు బహిరంగంగానే సపోర్ట్ చేశారు. ఈ వ్యవహారంలో... ముఖ్యమంత్రి జగన్ ను పక్కన ఉన్నవారు తప్పుదోవ పట్టిస్తున్నారని... ఆయన అంటే పర్సనల్ గా తనకు ఎంతో ఇష్టం అన్నారు వర్మ. ఇది జగన్ సొంతంగా తీసుకున్న నిర్ణయం అయ్యి ఉండదన్నారు వర్మ. నిన్నసినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో జరిగిన చర్చలు కూడా సానుకూలంగానే జరిగాయన్నారు వర్మ.
Also Read :Siddharth comments: సైనా నెహ్వాల్ పై హీరో సిద్దార్థ్ డబుల్ మీనింగ్ ట్వీట్.. మహిళా కమిషన్ కేసు నమోదు