కంగానా ఫోటోపై వర్మ ట్వీట్... ఆపై డిలీట్ !

Published : Feb 19, 2021, 07:45 AM IST
కంగానా ఫోటోపై వర్మ ట్వీట్... ఆపై డిలీట్  !

సారాంశం

ఎక్కువగా విమర్శిస్తూ... ఎప్పుడన్నా పొగిడే వర్మ, కంగనాను మాత్రం పొగడ్తలతో ముంచెత్తాడు. ఆమె కొత్త మూవీ పోస్టర్ ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశాడు. కంగనా ధాకడ్ అనే ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ మూవీలో కంగనా కిల్లింగ్ మెషిన్ లా కనిపిస్తున్నారు. చేతిలో గన్, ముఖం నిండా రక్తంతో, యుద్ధ భూమిలో వీరవనితలా ఆమె లుక్ ఉంది. 

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి నటిగా వరుస చిత్రాలు చేస్తూనే... వివాదాలలో కూడా ఉంటూ ఉంటారు. తరచూ బాలీవుడ్ పెద్దలపై ఆమె చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఆ మధ్య మహారాష్ట్ర గవర్నమెంట్ తోనే అమీ తుమీకి దిగింది కంగనా రనౌత్. బాలీవుడ్ పై డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నమెంట్ ని కూడా ఆమె తప్పుబట్టారు. 

మరి ఇలాంటి నటిపై వర్మ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎక్కువగా విమర్శిస్తూ... ఎప్పుడన్నా పొగిడే వర్మ, కంగనాను మాత్రం పొగడ్తలతో ముంచెత్తాడు. ఆమె కొత్త మూవీ పోస్టర్ ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశాడు. కంగనా ధాకడ్ అనే ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ మూవీలో కంగనా కిల్లింగ్ మెషిన్ లా కనిపిస్తున్నారు. చేతిలో గన్, ముఖం నిండా రక్తంతో, యుద్ధ భూమిలో వీరవనితలా ఆమె లుక్ ఉంది. 

సదరు లుక్ కంగనా సోషల్ మీడియాలో పంచుకోగా వర్మ స్పందించాడు. నా జీవితంలో నేను చూసిన బెస్ట్ క్లోజ్ అప్ ఫోటో ఇది. పాత్రలో లీనమై నటించడం అంటే అది నీ తర్వాతే. నీ ఫోటో చూసిన తరువాత స్పందించకుండా ఉండలేకపోతున్నాను. కంగనా నువ్వు ఓ న్యూక్లియర్ బాంబ్ .. అంటూ ఆయన ట్వీట్ చేశాడు. అయితే కారణం ఏమిటో గాని, ఆ ట్వీట్ ని వర్మ కాసేపటి తరువాత డిలీట్ చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

4 ఆటలతో 3 ఏళ్లు నాన్ స్టాప్ గా ఆడిన బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Spirit లో విజయ్‌ దేవరకొండ ? పాత్ర ఇదేనా.. వామ్మో బాక్సాఫీసు షేక్ అయ్యే మ్యాటర్‌