ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

Published : Oct 19, 2018, 12:34 PM ISTUpdated : Oct 19, 2018, 12:37 PM IST
ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

సారాంశం

దేవుడిని నమ్మనని చెప్పే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం చర్చనీయాంశమైంది. ఆయన దైవభక్తి పెరగడానికి కారణం దివంగత నందమూరి తారకరామారావు అని తెలుస్తోంది

దేవుడిని నమ్మనని చెప్పే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం చర్చనీయాంశమైంది. ఆయన దైవభక్తి పెరగడానికి కారణం దివంగత నందమూరి తారకరామారావు అని తెలుస్తోంది.

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందించబోతున్నారు. ఈ క్రమంలో ఆయన తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని గురువారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అన్నట్లుగానే ఆయన కొందరు బంధువులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇప్పటివరకు వర్మని చూడని గెటప్ లో భుజంపై కండువా, చేతిలో లడ్డూ పట్టుకొని ఆయన దిగిన ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో చూసిన వర్మ అభిమానులు సడెన్ గా ఇంత మార్పా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇది ఇలా ఉండగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని శిల్పారామంలో ప్రెస్ మీట్ నిర్వహించి 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి సంబంధించిన వివరాలను చెబుతానని వర్మ ప్రకటించారు.

ఇది కూడా చదవండి.. 

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

PREV
click me!

Recommended Stories

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవిగో
దళపతి విజయ్ టాప్ 5 సినిమాలు, బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ పెట్టుకుని రిటైర్మెంట్