బావ కొడుక్కి మహేష్ సపోర్ట్ లేదా..?

Published : Oct 19, 2018, 11:44 AM IST
బావ కొడుక్కి మహేష్ సపోర్ట్ లేదా..?

సారాంశం

టీడీపీ ఎంపీ, సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. 'అదే నువ్వు అదే నేను' అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకి హాజరై క్లాప్ కొట్టారు. ఈ వేడుకకు సినీ రాజకీయాల ప్రముఖులు హాజరయ్యారు. 

అయితే ఇప్పటివరకు మహేష్ బాబు మాత్రం తన మేనల్లుడి కోసం ఒక్క ట్వీట్ కానీ, పోస్ట్ కానీ పెట్టకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గతంతో పోల్చుకుంటే మహేష్ బాబు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

ఇతర హీరోల సినిమాల గురించి, ట్రైలర్ల గురించి ట్వీట్లు చేస్తూ తన సపోర్ట్ అందిస్తున్నారు. అయితే తన సొంత బావ కొడుకు సినిమా లాంచ్ అయిన సందర్భంగా ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం అభిమానుల్లో చర్చకు దారి తీసింది.

ఏదైనా సినిమా రిలీజ్ అయిన వెంటనే రిజల్ట్ పై స్పందిస్తోన్న మహేష్ తన మేనల్లుడి సినిమా పూజ వేడుక జరిగి ఒకరోజు దాటుతున్న తన విషెస్ ని మాత్రం చెప్పలేదు. తన బావ సుదీర్ బాబు సినిమాలకు సపోర్ట్ చేసే మహేష్ బాబు మరి తన మేనల్లుడు అశోక్ కి ఎలాంటి సపోర్ట్ అందిస్తాడో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌
Karthika Deepam 2 Latest Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర