
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నాడు. తనకు మాత్రమే వచ్చే ఐడియాలతో సినిమాను ప్రమోట్ చేస్తూ.. జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.
సోషల్ మీడియాలో రోజూ ఏదోక పోస్ట్ పెడుతూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నుండి జనాల దృష్టి ఎటూపోకుండా చూసుకుంటున్నాడు. తాజాగా ఈ చిత్రనిర్మాత రాకేశ్ రెడ్డికి సంబంధించిన ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు వర్మ. రాకేశ్ రెడ్డి విమానంలో ప్రయాణిస్తూ తీసుకున్న ఫోటో అది.
తన స్నేహితులతో కలిసి ఉన్న రాకేశ్ రెడ్డి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరో ట్వీట్ లో.. ఎడమ వైపు కూర్చొని ఉన్న వ్యక్తి రాకేశ్ రెడ్డి అని, మధ్యలో కూర్చొని ఉన్న వ్యక్తి అతని స్నేహితులు అని చెప్పిన వర్మ.. కుడివైపున ఉన్న వ్యక్తి ఎవరో తనకు తెలియదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
మధ్యలో కూర్చున్న వ్యక్తి వైసీపీ నేత మిథున్ రెడ్డి కాగా.. కుడివైపు కూర్చొని ఉన్నది వైసీపీ అధినేత జగన్. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. ''గూగుల్ తల్లికి తెలియనివి కూడా మీకు తెలుస్తాయి సామీ మీకు చెప్పేంత వాళ్లమా'' అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కాబోయే సీఎం అంటూ కామెంట్ చేస్తున్నారు.