మేడమ్.. అంటూనే నెటిజన్ కి చీవాట్లు పెట్టిన కరణ్ జోహార్!

Published : Feb 15, 2019, 04:41 PM IST
మేడమ్.. అంటూనే నెటిజన్ కి చీవాట్లు పెట్టిన కరణ్ జోహార్!

సారాంశం

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ మహిళపై మండిపడ్డారు. తన పిల్లలపై సదరు మహిళ చేసిన కామెంట్లే దీనికి కారణమని తెలుస్తోంది. 

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ మహిళపై మండిపడ్డారు. తన పిల్లలపై సదరు మహిళ చేసిన కామెంట్లే దీనికి కారణమని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం సరోగసి పద్ధతి ద్వారా కరణ్ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు.

అయితే ఆ పిల్లలకు తల్లి ప్రేమ దక్కకుండా చేస్తున్నారంటూ కరణ్ పై సోషల్ మీడియాలో ఓ నెటిజన్ కామెంట్ చేసింది. దీనిపై స్పందించిన కరణ్ ఆమెకి ధీటుగా సమాధానం చెప్పాడు.

మేడమ్.. అని మర్యాదగా పిలుస్తూనే చీవాట్లు పెట్టాడు. ఇలాంటి అనవసర మాటలు చెప్పి సమయం  వృధా చేసుకునే బదులు ఏదైనా పనిచేసుకోండని చెప్పారు. దేశంలో  పట్టించుకోవాల్సిన సమయాలు చాలా ఉన్నాయని, తన పిల్లలకు దక్కాల్సిన ప్రేమ దక్కుతోందని తనకది చాలని అన్నారు.

తన పిల్లలకు కూడా తల్లి ఉందని.. తన తల్లే తన బిడ్డలకు కూడా తల్లి అంటూ ఘాటుగా స్పందించాడు. ఎప్పుడైతే కరణ్ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడో.. అప్పుడే వారికి తల్లిలేని లోటు తెలియకుండా పెంచుతానని చెప్పాడు. 

PREV
click me!

Recommended Stories

Sreenivasan: నటుడు శ్రీనివాసన్ ని ఆరాధించిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఏకంగా తన పాత్రకి డబ్బింగ్‌
కృష్ణ ను భయపెట్టిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కు చెక్ పెట్టడానికి సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్