
స్త్రీ అంటే అందం, శృంగారం... వర్మ డిక్షనరీలో డెఫినిషన్స్ ఇవే. ఎంజాయ్ చేయడానికే ఉమన్ అని వర్మ ఓపెన్ గానే అనేకమార్లు కామెంట్ చేశాడు. నచ్చితే వస్తావా అని అడిగే వర్మ, రానన్న అమ్మాయిల కోసం టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకో అమ్మాయిని వెతుక్కుంటాడు. అలాగే ఈ అమ్మాయితో డీప్ రిలేషన్ పెట్టుకోవడం, ఎఫక్షన్ పెంచుకోవడం చేయదు. అయితే ఇలాంటి వర్మ కూడా ఓ సమయంలో ప్రేమలో పడ్డాడట. ట్విట్టర్ వేదికగా ఒకప్పటి తన ప్రేయసిని పరిచయం చేశాడు.
సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో వర్మ చదువుకునే రోజుల్లో సత్య అనే అమ్మాయిని ఇష్టపడ్డాడట. తన ఫస్ట్ లవర్ సత్య పోలవరం అమెరికాలో గైనకాలజిస్ట్ గా పనిచేస్తుందని వర్మ తెలియజేశారు.
అప్పట్లో ఇంజనీరింగ్, మెడిసిన్ ఒకే క్యాంపస్ లో రన్ చేశారట. దాని వలన సత్యతో వర్మ వన్ సైడ్ లవ్ లో పడిపోయారట. అయితే తనను సత్య ఇష్టపడదని వర్మ భావించాడట. కారణం తనకంటే అందమైన, రిచ్ అబ్బాయిలు ఉండగా తనకు సత్య ఎలా కనెక్ట్ అవుతుందని ఫీల్ అయ్యాడట. రంగీలా మూవీ స్టోరీకి ప్రేరణ సత్యనే అనే వర్మ ట్వీట్ చేశారు.
తన ల్యాండ్ మార్క్ మూవీ సత్య, క్షణ క్షణం చిత్రంలో శ్రీదేవి పేరు వెనుక కారణం తన లవర్ సత్యనే అట. ఇక మియామి బీచ్ లో బికినీలో ఎంజాయ్ చేస్తున్న సత్య ప్రెసెంట్ ఫోటోలు వర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలు సత్య వర్మకు పంపారట.