బట్టతల కామెడీ:‘101 జిల్లాల అందగాడు’ ట్రైలర్

Surya Prakash   | Asianet News
Published : Aug 25, 2021, 04:53 PM IST
బట్టతల కామెడీ:‘101 జిల్లాల అందగాడు’ ట్రైలర్

సారాంశం

‘ఏ జుట్టు దువ్వుకుంటే దువ్వెనలకు పళ్లు సైతం రాలతాయని భయమేస్తుందో.. ఏ జుట్టు ముడిస్తే, కొండలు సైతం కదలుతాయో.. అటువంటి బలమైన, దట్టమైన, అందమైన జుట్టు ఇచ్చి, నన్ను ఈ కేశ దారిద్ర్యం నుంచి బయటపడేసి..ఈ క్షవర సాగరం దాటించు స్వామి’, అని హీరో వేడుకోవడం బాగుంది.


అవసరాల శ్రీనివాస్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకుడు. రుహానీ శర్మ హీరోయిన్ గా నటించారు. ‘దిల్‌’ రాజు, డైరెక్టర్‌ క్రిష్‌ సమర్పణలో శిరీష్, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ మొత్తం ఫన్నీగా, నవ్వులు పంచేలా ఉంది. సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ని ఈ ట్రైలర్ పెంచేస్తోంది.

ఈ ట్రైలర్ లో అవసరాల శ్రీనివాస్ తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్‌తో అదరకొట్టాడు. తన పెళ్ళికి బట్టతల అడ్డంకిగా మారడం,లవ్ సీన్స్ సినమాపై ఇంట్రస్ట్ ని కలగచేస్తున్నాయి. నాలుగు అక్షరాలు.. ఇది ఉంటే వివాహానికి ఇబ్బంది ఏంటది అని తల్లి పజిల్‌ వేయగా.. బట్టతల అని శ్రీనివాస్‌ జవాబుఇవ్వడం హిలేరియస్‌గా ఉంది. 

‘ఏ జుట్టు దువ్వుకుంటే దువ్వెనలకు పళ్లు సైతం రాలతాయని భయమేస్తుందో.. ఏ జుట్టు ముడిస్తే, కొండలు సైతం కదలుతాయో.. అటువంటి బలమైన, దట్టమైన, అందమైన జుట్టు ఇచ్చి, నన్ను ఈ కేశ దారిద్ర్యం నుంచి బయటపడేసి..ఈ క్షవర సాగరం దాటించు స్వామి’, అని హీరో వేడుకోవడం బాగుంది.

‘‘ప్రేమలో నిజాయతీ ఉండాలనుకునే అమ్మాయి... దొరక్క దొరికిన ప్రేమను, ప్రేయసిని వదులుకోకూడదనుకునే యువకుడు తనకు బట్టతల అనే నిజాలను దాస్తాడు. ఆ నిజం బయటపడితే వారి ప్రేమలో ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయి? వారి మధ్య ఊసులు కరువై ఊహలే ఊసులైన వేళ ఎలా ఉంటుంది? తన ప్రేమలో నిజాయతీ ఉందని, తాను ఊరకనే మోసం చేయలేదని ప్రేమికుడు.. తెలిసి నిజాన్ని దాచి పెట్టడం తప్పు అనే ప్రేయసి చుట్టూ కథ తిరుగుతుందని చెప్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ