నిర్మాతకి, ఆడియెన్స్ కి మధ్య ప్రభుత్వ ఎవరు?.. టికెట్‌ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంపై వర్మ ప్రశ్నల వర్షం..

By Aithagoni Raju  |  First Published Jan 3, 2022, 9:28 PM IST

రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. ప్రముఖ టీవీ డిబేట్‌లో పాల్గొన్న ఆయన ఏపీలో టికెట్ల రేట్ల తగ్గుదల ప్రధానంగా ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. ప్రొడక్ట్ హోనర్‌కి(సినిమా నిర్మాత), వినియోగదారుడు(ఆడియెన్స్)కి మధ్య ప్రభుత్వం ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 


`సినిమాని తయారు చేసే నిర్మాతకి, ఆ సినిమాని చూసే ఆడియెన్స్ కి మధ్య ప్రభుత్వం ఎవరు? టికెట్‌ రేట్ల విషయంలో వారి జోక్యమేంటి ? అంటూ ప్రశ్నించారు వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఏపీ ప్రభుత్వం టికెట్‌ రేట్ల తగ్గుదల అనేది ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా, పెద్ద వివాదంగా మారింది. దీనిపై హీరోలు, నిర్మాతలు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో వివాదం కాస్త మరింత ముదురుతోంది.  దీనిపై ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా కమిటీని ఏర్పాటు చేశారు. 

ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. ప్రముఖ టీవీ డిబేట్‌లో పాల్గొన్న ఆయన ఏపీలో టికెట్ల రేట్ల తగ్గుదల ప్రధానంగా ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. ప్రొడక్ట్ హోనర్‌కి(సినిమా నిర్మాత), వినియోగదారుడు(ఆడియెన్స్)కి మధ్య ప్రభుత్వం ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్బంగా అనేక ఉదాహరణలు చెప్పారు వర్మ.  బయట మార్కెట్‌ని బట్టి నిర్మాత, దర్శకుడు సినిమాలు చేస్తారని, తాను తీసిన సినిమాని ఎంతకు అమ్మాలో అది పూర్తిగా మేకర్స్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆ సినిమాని చూడాలో వద్దో పూర్తిగా ఆడియెన్స్ ఇష్టమని తెలిపారు. వారు ఎక్కువ రేట్‌ పెట్టి కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇన్‌వాల్వ్ కావడమేంటి? అంటూ ప్రశ్నించారు. 

Latest Videos

undefined

ఆ సినిమాని ఎక్కువ రేట్‌ పెట్టి టికెట్‌ కొనాలో లేదో ఆడియెన్స్ స్థోమతపై ఆధారపడి ఉంటుందని, తాను సినిమా చూడాలనుకుంటే కొంటాడు, లేదంటే సైలెంట్‌గా ఉంటాడు. సినిమాకి సంబంధించి నిర్మాత, ఆడియెన్స్ మధ్య ఉండే రిలేషన్‌, వారిద్దరు బాగానే ఉన్నప్పుడు ప్రభుత్వం ఎవరూ జోక్యం చేసుకోవడానికి అని ఘాటుగా ప్రశ్నించాడు వర్మ. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కి, రోడ్డుపై బండికొట్టుకి ఒకే రేట్‌ పెడితే ఎలా ఉంటుంది? ఆ విషయంలో ప్రభుత్వం జోక్యం ఉందా? అని అడిగారు వర్మ. తాము అందించే లగ్జరీలను బట్టి స్టార్‌ హోటల్‌ వాళ్లు ఓ రేట్‌ నిర్ణయిస్తారని, రోడ్డుపై టిఫిన్‌ సెంటర్‌లో ఒక రేట్‌ ఉంటుందని, ఎవరు ఎక్కడ తినాలనేది వినియోగదారుడి ఇష్టమన్నారు వర్మ. 

 అంతేకాదు హీరోల రెమ్యూనరేషన్‌కి సంబంధించి ఆయన మాట్లాడుతూ, హీరో ఫేస్‌ చూసే ఆడియెన్స్ థియేటర్‌కి వస్తారని తెలిపారు. హీరో లేకపోతే పెద్ద సినిమాలు లేవన్నారు. హీరోకి సరిపడే కథతో సినిమాని తీస్తారని, హీరో కోసం ఆడియెన్స్ వస్తారని నిర్మాత కోట్లు ఖర్చుపెడతారని తెలిపారు. హీరో రెమ్యూనరేషన్‌ కూడా బడ్జెట్‌లో భాగమే అని తెలిపారు. ఆ హీరోకి ఎంత పారితోషికం ఇవ్వాలనేది డబ్బులు పెట్టే నిర్మాత ఇష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. హీరో చుట్టూతే బిజినెస్‌ తిరుగుతున్నప్పుడు ఆ హీరోకి ప్రయారిటీ ఉంటుందన్నారు. హీరోలకు అత్యధిక రెమ్యునరేషన్ ఇవ్వడానికి కారణం వారి బ్రాండ్ ఇమేజ్ అని చెప్పారు. సినీ నిర్మాత ఎవరైనా సరే సినిమాను తీసి తన మూవీకి టికెట్ ధర నిర్ణయించుకొంటే తప్పేమి లేదన్నారు. 

అయితే ఏపీలో టికెట్ల రేట్ల తగ్గుదల విషయంలో ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదని స్పష్టం చేశారు. అభిమానాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారని ఏపీ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న వాదనలో అర్థం లేదని, జగన్‌ సీఎం కావడానికి జనాలు ఎగబడి ఓట్లు వేశారని, వారి అభిమానాన్ని క్యాష్‌ చేసుకుని అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నిస్తే అర్థం లేదని తెలిపారు. కొంత మంది హీరోలను దృష్టిలో పెట్టుకుని టికెట్ల రేట్లు తగ్గిస్తే అది హీరోలకు వచ్చే నష్టం ఏం లేదన్నారు. కానీ సినిమాపై ఆధారపడ్డ వేల మంది రోడ్డునపడతారని తెలిపారు. థియేటర్లు రన్‌ చేయలేక మూసుకునే పరిస్థితి వస్తుందని, థియేటర్లపై ఆధారపడ్డ చాలా మంది ఉపాధి కోల్పోతారని వెల్లడించారు రామ్‌గోపాల్‌ వర్మ. 

సినిమా టికెట్ల రేట్లు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉందనేది సినిమాటోగ్రఫీ చట్టంలోనూ లేదని స్పష్టం చేశారు వర్మ. కేవలం థియేటర్ల నిర్వాహణ, క్వాలిటీ వంటి వాటి విషయంలోనే ప్రభుత్వానికి ఇన్‌వాల్వ్ మెంట్ ఉంటుందని, ఎంత రేట్‌కి టికెట్‌ అమ్మాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని మరోసారి వెల్లడించారు. ఇదంతా లాజిక్‌ లేని వాదన అని తెలిపారు. దీనిపై మాట్లాడేందుకు ఇండస్ట్రీ పెద్దలు ముందుకు రావడం లేదనే దానిపై స్పందిస్తూ, వాళ్లు మాట్లాడకపోవడానికి చాలా రకాల కారణాలున్నాయన్నారు. ఏదైనా మాట్లాడితే దాన్ని తప్పుగా అర్థం చేసుకుని వివాదాన్ని పెంచుతున్నారని, అందుకే బహుశా వాళ్లంతా సైలెంట్గా ఉన్నారేమో అని తెలిపారు. 
 

click me!