Keerthy Suresh: సీఎం కొడుకుతో కీర్తి సురేష్ రొమాన్స్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 03, 2022, 07:23 PM IST
Keerthy Suresh: సీఎం కొడుకుతో కీర్తి సురేష్ రొమాన్స్..

సారాంశం

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. 

నేను శైలజ చిత్రంతో Keerthy Suresh టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. 

తాజాగా కీర్తి సురేష్ ఓ ఆసక్తికర చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ తదుపరి చిత్రం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉండబోతోంది. ఈ చిత్రంలో ఉదయనిధి సరసన కీర్తి సురేష్ నటించేందుకు ఒకే చెప్పినట్లు సమాచారం. 

మారి సెల్వరాజ్ ప్రస్తుతం విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పూర్తి కాగానే ఉదయనిధి చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తోంది. 

Also Read: Sreemukhi: అందాల చందమామలా శ్రీముఖి.. చూడగానే మత్తెక్కించే అందాలు

PREV
click me!

Recommended Stories

Bharani: తన ఒరిజినాలిటీ బయటపెట్టిన భరణి.. మెగా బ్రదర్‌ నాగబాబు స్ట్రాటజీ పనిచేస్తుందా?
Akira Nandan నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ క్రేజీ రియాక్షన్‌