బాబాయ్ ఒడిలో పాలబుగ్గల పసివాడు.. సీనియర్ హీరోయిన్ కి దొరికిన బ్యూటిఫుల్ పిక్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 03, 2022, 08:06 PM IST
బాబాయ్ ఒడిలో పాలబుగ్గల పసివాడు.. సీనియర్ హీరోయిన్ కి దొరికిన బ్యూటిఫుల్ పిక్

సారాంశం

విక్టరీ వెంకటేష్ తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. బాబాయ్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ నటుడిగా గుర్తింపు పొందారు. ఇక వెంకటేష్, రానా మధ్య మంచి అన్యోన్యత ఉంది.

విక్టరీ వెంకటేష్ తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. బాబాయ్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రానా దగ్గుబాటి పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ నటుడిగా గుర్తింపు పొందారు. ఇక వెంకటేష్, రానా మధ్య మంచి అన్యోన్యత ఉంది. సాధారణంగా పిల్లలు తండ్రులతో కంటే బాబాయ్ లతోనే ఎక్కువ చనువుగా ఉంటారు. రానా విషయంలో కూడా అదే జరిగింది. చిన్నతనం నుంచి రానాకు వెంకీ అంటే ఎంతో ఇష్టం. 

వీరిద్దరి మధ్య బంధాన్ని తెలియజేస్తూ బ్యూటిఫుల్ పిక్ తో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సర్ప్రైజ్ చేసింది. ఇది ఆమె భద్రంగా దాచుకున్న ఫోటో అట. ఆ పిక్ ని నేడు ఖుష్బూ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'హే జూనియర్.. నేను దాచుకున్న బ్యూటిఫుల్ మెమొరీని నేడు బయటకు తీశాను' అంటూ ఖుష్బూ రానా కి ట్యాగ్ చేసింది. 

దీనితో థ్రిల్ ఫీలైన రానా వెంటనే స్పందించాడు. 'వావ్ థాంక్యూ.. హ్యాపీ న్యూ ఇయర్' అని రానా ఖుష్బూ కి రిప్లై ఇచ్చాడు. రానా తన చిన్నతనంలో వెంకటేష్ ఒడిలో ఆడుకుంటున్న బ్యూటిఫుల్ ఫోటో అది. రానా చిన్నతనంలో పాలబుగ్గలతో ముద్దులొలికేలా కనిపిస్తున్నాడు. 

Also Read: Keerthy Suresh: సీఎం కొడుకుతో కీర్తి సురేష్ రొమాన్స్..

ఇంతకీ ఈ పిక్ ఖుష్బూకి ఎలా దొరికిందనే సందేహం రావచ్చు. విక్టరీ వెంకటేష్ నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు. ఆ చిత్రంతోనే ఖుష్బూ హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. వెంకీ, ఖుష్బూ జంటగా నటించిన ఆ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దూ జంటగా త్రిమూర్తులు, భారతంలో అర్జునుడు లాంటి చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో రానా పసి పిల్లడు. ఆ టైంలో రానా తన బాబాయ్ తో ఆడుకుంటున్నప్పటి దృశ్యం ఇది. 

కలియుగ పాండవులు తర్వాత తెలుగు తమిళ భాషల్లో కుష్బూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఖుష్బూ తెలుగులో స్టాలిన్, యమదొంగ, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్