భారీ సినిమాలపై వర్మ సెటైర్లు.. `డీమాంటీ కాలనీ 2`పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..

By Aithagoni Raju  |  First Published Aug 22, 2024, 10:55 AM IST

రామ్‌ గోపాల్‌ వర్మ.. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్‌. ఆయన తాజాగా భారీ సినిమాలపై సెటైర్లు పేల్చారు. చిన్న సినిమాలను లేపిన ఆయన భారీ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 


రామ్‌ గోపాల్‌ వర్మ.. ఏం మాట్లాడినా సెన్సేషన్‌. ఆయన రెగ్యూలర్‌కి భిన్నంగా ఆలోచిస్తారు. అలానే మాట్లాడతాడు. ఇప్పుడు పెద్ద సినిమాలపై ఆయన సెటైర్లు పేల్చాడు. ప్రస్తుతం ట్రెండ్‌ మారిందని, చిన్న సినిమాలే పెద్దవి అవుతున్నాయని, పెద్ద విజయాలు సాధిస్తున్నాయని, కానీ పెద్ద సినిమాలు మాత్రం చిన్నవైపోతున్నాయని హాట్‌ కామెంట్‌ చేశారు వర్మ. `డీమాంటీ కాలనీ 2` ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అరుల్‌ నిధి, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన `డీమాంటీ కాలనీ 2` చిత్రానికి అజయ్‌ ఆర్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. 

గత వారం తమిళంలో విడుదలై హిట్‌ అయిన ఈ మూవీని ఈ నెల 23న తెలుగులోకి తీసుకు వస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ నైజాంలో రిలీజ్‌ చేస్తుంది. శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌కి రామ్‌ గోపాల్‌ వర్మ, దర్శకుడు అజయ్‌ భూపతి గెస్ట్ లు గా వచ్చారు.  వర్మ మాట్లాడుతూ, `నేను ఇరవై ఏళ్ల క్రితం భూత్ అనే సినిమాను చేశాను. అది అపార్ట్ మెంట్ లో జరుగుతుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక అపార్ట్ మెంట్స్ లోకి వెళ్లేందుకు కొంతకాలం భయపడి చాలామంది వెళ్లలేదు. `డీమాంటీ కాలనీ` రిలీజ్ అయ్యాక ఆ కాలనీ పేరు పెట్టినందుకు కాంట్రవర్సీ జరిగిందని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నాతో చెప్పారు. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ ఫుల్ ఫిల్మ్. కంటెంట్ ఉన్న సినిమాల చూసే ట్రెండ్ నడుస్తోంది. అలా  తెలుగులోనూ "డీమాంటీ కాలనీ 2" ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని తెలిపారు. 

Latest Videos

డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ, `నేను దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో "డీమాంటీ కాలనీ 1" రిలీజైంది. ఆ సినిమాను ల్యాప్ టాప్ లో ఎన్నోసార్లు చూసి థ్రిల్ అయ్యాను. సగం సినిమా ఒక గదిలోనే జరుగుతుంది కానీ మనల్ని డైరెక్టర్ ఎంగేజ్ చేయగలిగాడు. "డీమాంటీ కాలనీ 2" సినిమాను తీసుకుంటున్నా అని నా మిత్రుడు సురేష్ రెడ్డి చెప్పినప్పుడు ఒక్క క్షణం ఆలోచించకుండా తీసుకోమని సజెస్ట్ చేశాను. సేమ్ డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా బాగా చేస్తాడని చెప్పాను. నిన్న "డీమాంటీ కాలనీ 2" ప్రీమియర్ చూసినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యాం` అని అన్నాడు. 

చిత్ర దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు చెబుతూ, `ఈ సినిమాను 2023 జనవరిలోనే కంప్లీట్ చేశాం. సినిమా ఫస్ట్ కాపీ చేతిలోకి వచ్చాకే బిజినెస్ డీల్స్ చేయాలని అనుకున్నాం. `డీమాంటీ కాలనీ 2"కు మేము క్లోజ్ చేసిన ఫస్ట్ బిజినెస్ కూడా తెలుగు నుంచే. "డీమాంటీ కాలనీ 2" తమిళంలో మంచి హిట్ అయ్యింది. తెలుగు ఆడియెన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఈ మూవీకి 3, 4 పార్ట్స్ కూడా చేయబోతున్నాం. సెకండ్ పార్ట్ లోని ఆర్టిస్టులంతా థర్డ్ పార్ట్ లో కంటిన్యూ అవుతారు. ఇప్పటిదాకా ఏ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీ చూపించలేదు. మేము ఈ మూవీలో టిబెటియన్ యాక్టర్ ను పెట్టి ఆ ప్రయత్నం చేశాం` అని వెల్లడించారు. 

నిర్మాత బి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ, నాకు "డీమాంటీ కాలనీ" సినిమా బాగా నచ్చింది. "డీమాంటీ కాలనీ 2" అనౌన్స్ అయినప్పటి నుంచి డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తో ట్రావెల్ అవుతున్నాను. వీఎఫ్ఎక్స్ వల్ల మూవీ రిలీజ్ కొంత డిలే అయ్యింది. తమిళంలో బిగ్ హిట్ అయ్యిందీ సినిమా. తెలుగులోనూ అంతకంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. ఇందులో హారర్ కంటే థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఆకట్టుకుంటాయి` అని చెప్పారు. `డీమాంటీ కాలనీ 2` సినిమా స్పెషల్ ప్రీమియర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ దగ్గర నుంచి వచ్చిన ఆదరణ సంతోషాన్నిస్తోందని హీరోయిన్ ప్రియ భవానీ శంకర్  చెప్పారు.  

click me!