
వర్మ ఖాళీగా ఉంటే వోడ్కా కిక్ లోకి వెళ్ళిపోతారు. ఆయన దిన చర్యే మద్యపానంతో మొదలవుతుంది. మరి కిక్ లో ఉన్న వర్మకు రకాల ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఈ క్రమంలో ఆయన కథలు రాసుకుంటారు. లేదంటే ఎవరో ఒక సెలబ్రిటీని గెలుకుతారు. ఒక్కొక్కసారి తత్త్వం, వేదాంతం కూడా మాట్లాడతారు. సబ్జెక్టు ఏదైనా తనకు తెలియదని మాత్రం ఒప్పుకోరు. ప్రపంచంలోని ప్రతి సమస్యకు ఆయన వద్ద సమాధానం ఉంటుంది. తన సమాధానాన్ని నిజమే కదా అనిపించేలా చెప్పగల దిట్ట.
అలాంటి అపర మేధావి వర్మ(Ram Gopal Varma)కు ఓ సందేహం తోచింది. మానవ పరిణామక్రమ సిద్ధాంతం ప్రకారం మనిషి కోతులు, చింపాంజీల జాతి నుండి పుట్టాడు. ఐతే మరి కోతులు, చింపాంజీలు ఈ భూమ్మీద ఎందుకు ఉన్నాయంటూ? ఆయన నెటిజెన్స్ ని ప్రశ్నించారు. కోతులు మనుషులుగా మారడం నిజమైతే కోతుల జాతి ఇప్పటికీ భూమిపై ఎందుకు ఉందనేది ఆయన అనుమానం. వర్మ ప్రశ్నకు నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
వర్మ ప్రశ్నకు నెటిజన్స్ కామెంట్స్ కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆలోచించే విధంగా ఉన్నాయి. మొత్తంగా వర్మ మరోసారి తనదైన వ్యంగ్యాస్త్రం జనాలపైకి వదిలాడు. ఇక వర్మ లేటెస్ట్ మూవీ డేంజరస్ మూవీ వివాదాల్లో చిక్కుకుంది. లెస్బియన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని థియేటర్స్ యాజమాన్యాలు ప్రదర్శించడానికి నిరాకరించాయి. అప్సరా రాణి, నైనా గంగూలీ నటించిన ఈ మూవీ విడుదలకు బ్రేక్ పడింది.