Ante Sundaraniki Teaser: నాని అంతా చేసి ఇలా ట్విస్ట్‌ ఇచ్చాడేంటి ?.. ఆ డౌట్‌ ఏంటి?

Published : Apr 20, 2022, 12:06 PM IST
Ante Sundaraniki Teaser: నాని అంతా చేసి ఇలా ట్విస్ట్‌ ఇచ్చాడేంటి ?.. ఆ డౌట్‌ ఏంటి?

సారాంశం

హీరో నాని మరో కామెడీ సినిమాతో వస్తున్నారు. ఆయన వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన `అంటే సుందరానికి` చిత్రంలో నటించారు. ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తుంది.

నేచురల్‌ స్టార్‌ నాని మరో వైవిధ్యభరితమైన సినిమాతో వస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ప్రస్తుతం `అంటే సుందరానికి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఇందులో నాని సుందర ప్రసాద్‌ పాత్రలో కనిపిస్తాడు. ఆయన ఫ్యామిలీ హిందూ సంప్రదాయాలను బాగా నమ్మే బ్రహ్మణ కుటుంబం. అలాంటిది ఓ క్రిస్టియన్‌ అమ్మాయితో ప్రేమలో పడతారు. మరి పట్టింపులు ఎక్కువగా ఉన్న రెండు కుటుంబాలు వీరి ప్రేమని అంగీకరించా? అంతా ఓకే అనుకునే సమయంలో సుందరం గురించి ఓ వార్త తెలుస్తుంది. ఆ వార్తేంటి? `అంటే.. సుందరానికి ఏమైంది` అనేది ట్విస్ట్ తో టీజర్‌ ముగుస్తుంది. 

దీంతో అప్పటి వరకు హంగామా చేసిన నాని, చివర్లో పెద్ద ట్విస్ట్ ఇవ్వడంతో ఏం జరిగిందనేది ఆసక్తి నెలకొంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో నానికి జోడీగా నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ వై నిర్మాతలు. ఈ చిత్రాన్ని జూన్‌ 10న విడుదల చేయబోతున్నారు. సినిమా కథేంటో చెప్పి, ఎలా ఎంటర్‌టైన్‌బోతున్నామో కూడా టీజర్‌లో చెప్పడం విశేషం. 

టీజర్‌ ఆద్యంతం సరదాగా సాగుతుంది. వివేక్‌ ఆత్రేయ హ్యుమర్‌కి, నాని ఇన్నెసెంట్‌ యాక్టింగ్‌ తోడవడంతో ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ఈ సినిమాలో నరేష్, రోహిణి, నదియా, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళంలోనూ విడుదల చేస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?