The Kashmir Files: తెలుగులో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌, వివరాలు

Surya Prakash   | Asianet News
Published : Apr 20, 2022, 12:17 PM IST
The Kashmir Files: తెలుగులో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌, వివరాలు

సారాంశం

మార్చి 11న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ప్రధానీ మోదీ సైతం ప్రశంసించిన ఈ సినిమాను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.   

 ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.. ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్  సాధించిందో  స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఎలాంటి ఎక్సపెక్టేషన్స్  లేకుండా విడుదలైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి స్టార్‌ కాస్ట్‌ లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను తలికిందులు చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది.  చెప్పాలంటే పాన్‌ ఇండియా వంటి సినిమాలకు ఈ మూవీ పోటీ ఇచ్చింది. 1990లో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ చూడవచ్చు. అయితే కొంత టైమ్ ఉంది.

 ది కశ్మీర్‌ ఫైల్స్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకుంటే థియేటర్లో కేవలం హిందీలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌ కానుందట. ఇప్పటికే ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. త్వరలోనే ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ స్ట్రీమింగ్‌ డేట్‌పై జీ5 అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుంది. 

ఈ విషయాన్ని స్వయంగా జీ5 చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మనీశ్‌ కల్రా ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు.  దీని ప్రకారం ఈ మూవీ అతికొద్ది రోజుల్లోనే అంటే మే మొదటి వారంలో జీ5లో విడుదల కానుందని సదరు మీడియాతో మనీశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు నుంచి భారీ రెస్పాన్స్‌ వస్తోంది. అందుకే జీ5లో కశ్మీర్‌ ఫైల్స్‌ను ఎక్స్‌క్లూసివ్‌గా స్ట్రీమింగ్‌ చేయబోతున్నాం’ స్పష్టం చేశారు.  

ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటులు అనుపమ్‌ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ప్రధానీ మోదీ సైతం ప్రశంసించిన ఈ సినిమాను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Nandamuri Balakrishna: క్లాస్ సినిమాతో బాలయ్యకి చుక్కలు చూపించిన జగపతి బాబు.. పాపం సుమన్ బలి
Psych Siddhartha Movie Review: సైక్‌ సిద్ధార్థ మూవీ రివ్యూ, రేటింగ్‌.. జెంజీ మూవీతో నందుకి హిట్‌ పడిందా?