
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పవన్ ఫ్యాన్స్ కి బద్దశత్రువు. గత కొంత కాలంగా వీరి వైరం కొనసాగుతుంది. పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్స్ వేసే వర్మ, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొన్ని చిత్రాలు కూడా చేశారు. పవర్ స్టార్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి చిత్రాల్లో పవన్ ని తక్కువ చేసి చూపించారు. పవన్ విషయంలో వర్మ తీరుకు విసిగిపోయిన ఫ్యాన్స్ పలుమార్లు భౌతిక దాడులకు దిగారు. అంతగా వర్మ అంటే పవన్ ఫ్యాన్స్ కి కోపం ఉంది.
అలాంటి వర్మ ఈ మధ్య పంథా మార్చారు. పవన్ గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ (Pawan Kalyan)రేంజ్ కి భీమ్లా నాయక్ చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలని సూచించారు. భీమ్లా నాయక్ హిందీలో విడుదల చేస్తే బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలవుతాయని, పవన్ దేశంలోనే అతిపెద్ద స్టార్ గా అవతరిస్తాడని సూచించాడు. మరలా భీమ్లా నాయక్ ట్రైలర్ పై నెగిటివ్ కామెంట్స్ చేశాడు.
కాగా నేడు భీమ్లా నాయక్ (Bheemla Nayak)తెలుగు వర్షన్ విడుదలైంది. భీమ్లా నాయక్ ఫ్యాన్స్ కి ఐఫీస్ట్ అంటూ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో వర్మ భీమ్లా నాయక్ చిత్రం పై షార్ట్ రివ్యూ ఇచ్చాడు. భీమ్లా నాయక్ మూవీ పిడుగైతే పవన్ కళ్యాణ్ సునామి. రానా దగ్గుబాటి పవన్ కి సమవుజ్జి. మొత్తంగా మూవీ ఒక భూకంపం.. అంటూ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో అందుకే నేను పదే పదే చెబుతున్నాను. భీమ్లా నాయక్ హిందీ వెర్షన్ విడుదల చేయండి. సెన్సేషన్ అవుతుంది.. అంటూ కామెంట్ చేశారు. ఈ రెండు ట్వీట్స్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. వర్మ పాజిటివ్ గా భీమ్లా నాయక్ రివ్యూ ఇచ్చినా ఫ్యాన్స్ రెస్పాన్స్ మాత్రం నెగిటివ్ గానే ఉంది. ఎప్పుడు ఎలా మాట్లాడతావో తెలియదు. నీ కామెంట్ తిట్టో, పొగడ్తో కూడా తెలియదు. నీ అప్రిసియేషన్ మాకొద్దు వర్మ, అంటున్నారు. వర్మ లోపలి ఉద్దేశం ఏదైనా భీమ్లా నాయక్ గురించి ఆయన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
భీమ్లా నాయక్ విషయంలో వర్మ చెప్పిన ఒక జోస్యం నిజమైంది. పవన్ కి మించి రానా (rana daggubati) పాత్ర హైలెట్ అవుతుందని ఆయన ప్రెడిక్ట్ చేశారు. నిజంగా పవన్ ఫ్యాన్స్ ని మినహాయిస్తే న్యూట్రల్ ఆడియన్స్ రానా యాక్టింగ్ సినిమాలో ప్రధాన హైలెట్ అంటున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రానా మెస్మరైజ్ చేశారు అంటున్నారు. కారణం తెలియదు కాని భీమ్లా నాయక్ హిందీ వర్షన్ ఇంకా విడుదల కాలేదు. సన్నాహాలైతే జరుగుతున్నాయి.