Varam-Balakrishna: బాలయ్య షోకి వస్తా... వర్మ హృదయపూర్వక విజ్ఞప్తి!

Published : Jan 19, 2022, 01:35 PM IST
Varam-Balakrishna: బాలయ్య షోకి వస్తా... వర్మ హృదయపూర్వక విజ్ఞప్తి!

సారాంశం

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ఈ షోపై స్పందించారు. అన్ స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో తనకు పాల్గొనాలని ఉందని, బాలయ్యతో ముచ్చటించాలని ఉందన్న కోరికను బయటపెట్టాడు. 

నటసింహం బాలకృష్ణ (Balakrishna) టైం మాములుగా లేదు. ఆయనకు 2021 బాగా కలిసొచ్చింది. అఖండ (Akhanda)లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కానుకగా ఇచ్చింది. వరుస ప్లాప్స్ తో బాలకృష్ణ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో అఖండ మూవీతో కమ్ బ్యాక్ అయ్యాడు. అలాగే హోస్ట్ గా బాలయ్య తిరుగులేని రికార్డ్స్ నమోదు చేశాడు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో ప్రపంచంలోనే బెస్ట్ టాక్ షోల్లో ఒకటిగా నిలిచింది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అన్ స్టాపబుల్ టాక్ షో భారీ సక్సెస్ కొట్టింది. 

తెలుగులో ఇంతవరకు బోల్డ్ టాక్ షోలు ప్రసారం కాలేదు. సెలెబ్రిటీల షోలు దాదాపు యాభై శాతం ఫిల్టర్స్ తో సాగుతాయి. డిప్లమాటిక్ ప్రశ్నలు, వాటికి ఆన్సర్స్ తో ఓ గంట అలా సాగిపోతుంటాయి. హోస్ట్ ఎప్పటికీ గెస్ట్ లైఫ్ లో ఉన్న కాంట్రవర్సీల జోలికిపోరు. కానీ బాలయ్య ముఖ్యంగా వాటిపైనే ఫోకస్ చేస్తున్నాడు. ఇదే మిగతా టాక్ షోకు భిన్నంగా అన్ స్టాపబుల్ (Unstoppbale talk show) షోని నిలిపింది. మొత్తంగా ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఆదరణ పెరుగుతూ పోతుండగా... బాలయ్య స్టామినా ఏమిటో రుజువైంది. 

అయితే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ఈ షోపై స్పందించారు. అన్ స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో తనకు పాల్గొనాలని ఉందని, బాలయ్యతో ముచ్చటించాలని ఉందన్న కోరికను బయటపెట్టాడు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. బాలయ్య తనకు అవకాశం ఇవ్వాలని వర్మ స్వయంగా ట్వీట్ చేయడం ఆసక్తి రేపుతోంది. 

మరి ఏ సెలెబ్రిటీ జీవితంలో అయినా ఒకటి రెండు కాంట్రవర్సీలు ఉంటాయి. వర్మ జీవితంలో అన్ని వివాదాలే. వీటిలో ఏ వివాదాల గురించి బాలకృష్ణ మాట్లాడాలి అనేదే పెద్ద సమస్య. ఇక వర్మ హేళనగా మాట్లాడిన వాళ్లలో బాలకృష్ణ కూడా ఉన్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి చిత్రాల్లో చంద్రబాబుతో పాటు బాలయ్య కుటుంబాన్ని కూడా వర్మ కించపరిచేలా చూపించాడు. ఇవన్నీ బాలయ్య మనసులో ఉన్నాయి. అవన్నీ మరచి సెన్సేషన్ కోసం వర్మను పిలుస్తారని నమ్మకంగా చెప్పలేం. 

మరోవైపు వర్మ ఏపీలో తగ్గించిన సినిమా టికెట్స్ ధరలపై పోరాటం చేస్తున్నారు. బాలకృష్ణ సైతం సినిమా టికెట్స్ ధరలు తగ్గించడాన్నివ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో వీరి అభిప్రాయాలు కలిసిన నేపథ్యంలో షోలో కూడా కలవవచ్చు. మరో వైపు ఇది ఆహా మేనేజ్మెంట్ నిర్ణయం కనుక... వారు వర్మను గెస్ట్ గా ఆహ్వానిస్తే బాలయ్య ఇంటర్వ్యూ చేయాల్సిందే. కాగా వర్మ చాలా సార్లు బాలయ్య అంటే నాకు భయం అని చెప్పడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Samantha రికార్డుని బ్రేక్‌ చేసిన తమన్నా.. టాప్‌లో సాయిపల్లవి.. అత్యధిక వ్యూస్‌ సాధించిన టాప్‌ 5 సాంగ్స్
Illu Illalu Pillalu Today Episode Jan 17 అమూల్య నిశ్చితార్థం ఆపేందుకు భారీ ప్లాన్ వేసి శ్రీవల్లి, భాగ్యం.. కానీ