
తిరుమలకు చేరుకున్న ఆమె వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి చేసిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచం పొందారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో ఆమెను సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మాట్లాడుతూ చేనేత వర్గాలు బాగుండాలని శ్రీవారిని ప్రార్దించానని తెలిపింది. అదే విధంగా ప్రభుత్వం వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలని, అప్పుడు అందరికీ బాగుంటందని అభిప్రాయపడ్డారు. ఏకదశి సందర్భంగా మొదటి సారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నానని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టైంది.
ఈ సారి దర్శనం అద్భుతంగా జరిగిందని అన్నారు. తన మొక్కు తీరితే మళ్లీ శ్రీవారి దర్శనానికి వస్తానని తెలిపారు. తిరుపతిని సందర్శించడం సంతోషానిచ్చిందని చెప్పారు. తర్వాత తిరుమల నుంచి కంచికి వెళ్ళి అమ్మ వారిని దర్శించుకుంటానని ఆమె తెలిపారు.
అయితే, ప్రస్తతం సినిమాల్లో ఎక్కువగా కనిపించని నటి పూనమ్ గతేడాది ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా, తాను కూడా బీజేపీలో చేరుతున్నట్టు కొంత రూమర్లు వచ్చాయి. గతంలో పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ పై పలు రూమర్లతో పెద్ద ఎత్తున్న చర్చ జరిగిన విషయం తెలిసిందే.