Saptagiri : మరో సినిమాకు ‘సప్తగిరి’ రెడీ.. ఫిబ్రవరిలోనే షూటింగ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 19, 2022, 10:50 AM IST
Saptagiri : మరో సినిమాకు ‘సప్తగిరి’ రెడీ.. ఫిబ్రవరిలోనే షూటింగ్

సారాంశం

అదిరిపోయే కామెడీ స్కిల్స్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు సప్తగిరి. కామెడీలో వెరైటీని చూపించడంలో ఈయనకు ఈయనే సాటి. పాత్ర నిడివి తక్కువగా ఉన్నా తన మాటలు, పంచ్ లు తో కడుపుబ్బ నవ్విస్తాడు సప్తగిరి. అయితే త్వరలో సప్తగిరి మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు.   

సినిమాల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అటు నవ్విస్తూనే.. మరో వైపు హీరోగా తన ప్రభతను చాటుతున్నాడు. గతంలో పలు చిత్రాలతో అలరించిన సప్తగిరి నెక్ట్స్ మూవీ షూటింగ్ కూడా  స్టార్ట్ కానుంది. సప్తగిరి హీరోగా ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రిగ్వేద క్రియేషన్స్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. 

హీరోగానూ, స్టార్ కమెడియన్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి కొత్త సినిమాకు సంతకం చేశాడు. 'యజ్ఞం', 'పిల్లా... నువ్వు లేని జీవితం' వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఎ.ఎస్. రవికుమార్ చౌదరి తెరకెక్కించనున్న  ఓ సినిమాలో సప్తగిరి లీడ్ రోల్ చేస్తున్నారు. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఎ.ఎస్. రిగ్వేద చౌదరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఫిబ్రవరి సెకండ్ లేదా థర్డ్ వీక్ లో షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమచారం.   

అయితే సినిమాకు సంబంధించిన వివరాలను నిర్మాత ఎ.ఎస్. రిగ్వేద చౌదరి తెలిపారు. రిగ్వేద మాట్లాడుతూ  వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది  అని అన్నారు. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కొత్త కథ, కథనాలు ఉంటాయని తెలిపారు. ప్రముఖంగా రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుండటం సినిమాకు మరో బలమన్నారు.  ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి.  

సప్తగిరి హీరోగా నటించనున్న ఈ చిత్రానికి పీఆర్వో: పులగం చిన్నారాయణ, సంగీతం : గౌతం రాజు, ఫైట్స్  : రామ్ - లక్ష్మణ్, డీవోపీ : సిద్ధం మనోహర్, ఆర్ట్ : రమణ వంక, కో-డైరెక్టర్: మురళీధర్ రావు, పాటలు: సుద్దాల అశోక్ తేజ, కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, సహ నిర్మాత: దేవినేని రవి, నిర్మాత: ఎ.ఎస్. రిగ్వేద చౌదరి, కథ - స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్. రవికుమార్ చౌదరి వహించనున్నారు. 

అయితే కామెడీ రోల్స్ కే పరిమితం కాకుండా సప్తగిరి తనదైన శైలిలో కొత్త ప్రాజెక్ట్ లతో ముందుకెళ్తున్నారు. ‘ప్రేమ కథ చిత్రం’తో మంచి గుర్తింపు తెచ్చించుకున్న సప్తగిరి ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాల్లోని అవకాశాలను అందిపుచుకున్నారు. హీరోగా తన సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్ బీ, వజ్ర కవచధార గోవింద సినిమాలు చేశారు. త్వరలో మరో మూవీతో రానున్నారు. 

PREV
click me!

Recommended Stories

Samantha రికార్డుని బ్రేక్‌ చేసిన తమన్నా.. టాప్‌లో సాయిపల్లవి.. అత్యధిక వ్యూస్‌ సాధించిన టాప్‌ 5 సాంగ్స్
Illu Illalu Pillalu Today Episode Jan 17 అమూల్య నిశ్చితార్థం ఆపేందుకు భారీ ప్లాన్ వేసి శ్రీవల్లి, భాగ్యం.. కానీ