క్యాసినో కింగ్ చీకోటీ ప్రవీణ్ తో ఆర్టీవి భేటి, మరో సంచలనానికి ప్లాన్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ..?

Published : Nov 02, 2022, 04:12 PM ISTUpdated : Nov 02, 2022, 04:19 PM IST
క్యాసినో కింగ్ చీకోటీ ప్రవీణ్ తో  ఆర్టీవి భేటి,  మరో సంచలనానికి  ప్లాన్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ..?

సారాంశం

సంచలనాల దర్శకుడు అనిపించున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఏమాత్రం ఖాళీగా ఉండకుండా.. ఆడియన్స్ ను ఖాళీగా ఉంచనీయకుండా ఏదో ఒక సంచలనాలకు తెరతీస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తో ఆర్జీవి భేటి సంచలనంగా మారింది.   

ఆడియన్స్ ను ఖాళీగా ఉంచనీయకుండా ఏదో ఒక సంచలనాలకు తెరతీస్తూనే ఉన్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇక తాజాగా కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తో ఆర్జీవి భేటి సంచలనంగా మారింది. మొత్తానికి సంచలనాల దర్శకుడు అనిపించున్నాడు రామ్ గోపాల్ వర్మ

ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదం అంటే వర్మ... వర్మ అంటే వివాదం అంటుంటారు. సంచలనాలను వెతుక్కుంటూ వెళ్లి సినిమాలు చేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ.  వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చున్న రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. దేశంలో ఏ సంచలన ఘటన చోటు చేసుకున్నా వెంటనే దానిపై తనదైన స్టైల్లో ట్విట్ చేస్తుంటారు. ఎక్కడ ఏం జరిగినా.. వర్మ ఎలా స్పందించి ఉంటాడు అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు జనాలు. 

ముఖ్యంగా సినిమాల విషయంలో... రాజకీయాల విషయంలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు రాము. అవతలవాళ్లపై సెటైర్లు వేస్తూ..వెటకారంగా ట్వీట్లు చేయడంతో వర్మకు సాటి ఎవరూ రారు. ఇక రీసెంట్ గా మరో సంచలనానికి తెర తీశారు వర్మ. మొన్నటి వరకూ క్యాసినో వ్యవహరంతో పాటు హవాలా డబ్బు విషయంలో తీవ్ర విమర్షలు ఎదుర్కొని.. కేసులతో సంచలనంగా మారిన చీకోటి ప్రవీన్ తో భేటీ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. 

 

 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చికోటీ ప్రవీణ్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. క్యాసినో , మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ని విచారించిన విషయం తెలిసిందే. ఆ మద్య ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. చికోటి ప్రవీణ్ సినీ, రాజకీయ నేతలో అత్యంత సన్నిహితంగా ఉంటారు. అప్పట్లో కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారాయన. అంతే కాదు మరికొన్నిసినిమాల్లో విలన్ గా కూడా  నటించారు. కానీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. తాజాగా చికోటి ప్రవీణ్ ని ఫారం హౌజ్ కి వెళ్లి కలిశారు రాంగోపాల్ వర్మ.

ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ఫోటోలతో సహా వెల్లడించాడు. దాంతో వీరి భేటి ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇంతకీ వర్మ ఎందకు అక్కడి వెళ్లి ఉంటారు అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వర్మ మాత్రం ఏ విషయం క్లియర్ గా చెప్పకుండా  ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేసి వచ్చారు.  ఈ సందర్భంగా అక్కడ ఉన్న జంతువులను సందర్శించారు. ఇక్కడ వాతావరణం ఎంతో అహ్లాదంగా ఉందని.. ఆయన సేకరించిన ఎన్నో రకాల జంతువులు తనను బాగా ఆకర్షించాయని.. ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు ఆర్జీవి. 

ఇక ప్రస్తుతం వర్మ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయలపై ఒక పొలిటికల్ మూవీ తీయబోతున్నట్లు ప్రకటించారు రాంగోపాల్ వర్మ. గతంలో పలు వివాదాస్పద పొలిటికల్ సినిమాలను వర్మ తెరకెక్కించి సంచలనంగా మారారు.  అయితే చికోటి ప్రవీణ్ ని రాంగోపాల్ వర్మ ఎందుకు కలిశారు అన్న విషయం పై రక రకాల చర్చలు నడుస్తున్నాయి. ఆయన కథను సినిమాగా చేస్తారేమో అని కొంత మంది అంటుంటే.. లేదు లేదు ప్రవీణ్ ప్రొడ్యూసర్ గా వర్మ మరో సినిమా చేస్తారంటూ.. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్