గద్దరన్న పాటకి వర్మ మాస్‌ డాన్సు.. షేక్‌ అయిన`కొండా` ప్రీ రిలీజ్‌ ఈవెంట్.. వీడియో వైరల్‌

Published : Jun 19, 2022, 10:59 AM IST
గద్దరన్న పాటకి వర్మ మాస్‌ డాన్సు.. షేక్‌ అయిన`కొండా` ప్రీ రిలీజ్‌ ఈవెంట్.. వీడియో వైరల్‌

సారాంశం

ప్రజా గాయకుడు గద్దర్‌ పాడే పాపులర్‌ పాట `పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా` అనే పాటని రీక్రియేట్‌ చేశారు. వర్మ ఈ పాటని తనదైన స్టయిల్‌లో మార్చుకుని పాడారు.

రామ్ గోపాల్‌ వర్మ తన సినిమాల ప్రచారం కోసం ఏమైనా చేస్తాడు. అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటాడు. ఇప్పుడు తను రూపొందించిన `కొండా` సినిమా కోసం అదే చేస్తున్నారు. కొండా సురేఖ, మురళీ జీవితాల ఆధారంగా రూపొందిన `కొండా` చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. త్రిగుణ్‌, ఇర్రామోర్‌ జంటగా నటించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. కొండా దంపతులు అతిథులుగా పాల్గొన్న ఈ ఈవెంట్‌లో వర్మ హైలైట్‌గా నిలిచారు. 

ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ పాడే పాపులర్‌ పాట `పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా` అనే పాటని రీక్రియేట్‌ చేశారు. వర్మ ఈ పాటని తనదైన స్టయిల్‌లో మార్చుకుని పాడారు. సినిమాలోని ఈ పాటని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ స్టేజ్‌పై ప్రదర్శించారు. అయితే దీనికి రామ్‌గోపాల్‌ వర్మనే పర్‌ఫార్మ్ చేయడం విశేషం. చేతిలో గన్ను పట్టి, ఎర్రటి టవల్‌ ధరించి, టోపీ పెట్టి స్టేజ్‌పై డాన్సర్లతో కలిసి డాన్సు చేసి అదరగొట్టారు. ఆయన తనదైన స్టయిల్‌లో స్టెప్పులేస్తూ, హవభావాలు పలికిస్తూ నవ్వులు పూయించారు. అదే సమయంలో కాసేపు స్టేజ్‌ని షేక్‌ చేశారు. ఈవెంట్‌కి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం వర్మ డాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. వర్మ సైతం దీన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. 

ఈ ఈవెంట్‌లో వర్మ మాట్లాడుతూ, `కొండా మురళి, సురేఖ జీవితాన్ని రెండు గంటల్లో వీలైనంత బాగా సినిమా తీయడానికి ప్రయత్నించా. కాళికాదేవిలా సురేఖ విశ్వరూపం చూపించారు. ఆవిడ మాటల్లో చూపిస్తే, కొండా మురళి చేతల్లో చూపిస్తారు. మురళి చేతలు, సురేఖ మాటలు కలిస్తే దంపతులు అయ్యారు. నేను ఆశించిన దానికంటే త్రిగుణ్‌ ఎక్కువ చేశాడు. ఇర్రా మోర్ అద్భుతంగా నటించింది. అభిలాష్ మెయిన్ విలన్ రోల్ చేశాడు. 'గాయం'లో 'చెలి మీద చిటికెడు దయ రాదా...' అని రొమాంటిక్ సాంగ్ తీశా. ఊర్మిళపై తీసిన ఆ పాటకు సుచిత్ర గారు కొరియోగ్రఫీ చేశారు. అప్పట్నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. గొప్ప గేయ రచయితల్లో ఒకరైన చంద్రబోస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన 'సురేఖమ్మ' పాట రాశారు. సుచిత్ర 'తెలంగాణ పోరి' పాటకు కొరియోగ్రఫీ చేశారు. గద్దర్ పాటలు కొన్ని తీసుకున్నాం. డి.ఎస్.ఆర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు` అని చెప్పారు.  

కొండా మురళి మాట్లాడుతూ, ముంబై మాఫియా, విజయవాడ రౌడీలను వర్మ చూశారు. మాజీ పోలీసులు, నక్సలైట్లను కలిసిన తర్వాత తెలంగాణలో ఇంత కష్టపడిన మనిషి ఉంటాడా? అని నా జీవితాన్ని సినిమాగా తీశారు వర్మ. 30 ఏళ్ళ క్రితం నాకు పోలీసులు 50 శాతం, నక్సలైట్లు 50 శాతం సాయం చేశారు. రెండు వర్గాల సాయంతో నేను ఈ స్థాయికి వచ్చాను. ఆర్కే కనుసన్నల్లో నేను ఈ స్థాయికి వచ్చాను. నాకు సాయం చేసినవాళ్లను నేను మర్చిపోను. నా జీవితంలో ఆర్జీవీని మర్చిపోను. నా పాత్రలో త్రిగుణ్ బాగా నటించారు` అని అన్నారు.   

కొండా సురేఖ మాట్లాడుతూ, `వర్మకి ఏం ఇచ్చుకున్నా మా రుణం తీర్చుకోలేం. అధికారం ఉంటే దయాకర్ రావు ఏం చేస్తారనే దానికి ఉదాహరణ ఈ రోజు రేవంత్ రెడ్డి ఇక్కడికి రాకపోవడం! ఇటువంటి సంఘటనలు మా జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. కొండా మురళి నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ రోజు నేను ఇలా ప్రజల ముందు నిలబడ్డాను. నా జీవిత చరిత్ర వారితో తెరకెక్కింది. మురళి గారి పాత్ర పోషించిన త్రిగుణ్‌ నా కొడుకు లాంటోడు. నా పాత్రలో ఇర్రా మోర్ కూడా బాగా నటించింది. జూన్ 23 నుంచి థియేటర్లలో సినిమా చూడండి. 'కొండా' చూశాక... ప్రజల్లో ప్రశ్నించే తత్త్వం వస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కొండా సుష్మితా పటేల్‌, త్రిగుణ్‌, ఇర్రా మోర్‌,చిత్ర బృందం పాల్గొంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Atlee Kumar: ఒక్క ఫ్లాప్ లేదు.. రెండు ఇండస్ట్రీల్లో సంచలనం సృష్టించిన డైరెక్టర్!
Mangli: శ్రీముఖిపై అతడి కన్ను పడింది, అందుకే నన్ను టార్గెట్ చేశాడు..సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు