Pawan Kalyan: విసుగెత్తిన పవన్ స్ట్రిక్ట్ వార్నింగ్, డెడ్ లైన్ ?

Surya Prakash   | Asianet News
Published : Jun 19, 2022, 09:14 AM IST
Pawan Kalyan: విసుగెత్తిన  పవన్ స్ట్రిక్ట్ వార్నింగ్, డెడ్ లైన్ ?

సారాంశం

ఇందులో పవన్‌కల్యాణ్‌ పేద ప్రజలకు అండగా నిలిచే బందిపోటు పాత్రలో కనిపిస్తారు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది  .

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు. వకీల్ సాబ్  , భీమ్లా నాయక్  లాంటి  వరస హిట్స్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న వీరమల్లు చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ 17వ శతాబ్దంలోని మొఘలుల కాలంనాటి కథతో తెరకెక్కుతోంది.  అయితే ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలం అయినా రకరకాల కారణాలతో  డిలే అవుతూ వస్తోంది. కోవిడ్ తర్వాత ఈ షూటింగ్ తిరిగి మొదలైనా అనుకున్న స్పీడుతో పరుగెట్టడం లేదు. ఈ సినిమాకు ఫైనాన్సియల్ సమస్యలు రావటం వల్లే లేటు అవుతోందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

మరో ప్రక్క అదేం కాదు అనుకున్న స్దాయిలో రష్ రాకపోవటంతో రీషూట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ రెండు కాదు పవన్ కళ్యాణ్ పొలిటికల్ పనులతో ఈ సినిమాని పూర్తి చేయలేకపోతున్నారు అని కొందరంటున్నారు. ఇందులో  ఏది నిజమనేది ప్రక్కన పెడితే పనవ్ ఈ సినిమాపై పూర్తి దృష్టి పెట్టారని సమాచారం.  అందుతున్న సమాచారం మేరకు దర్శక,నిర్మాతలను కూర్చో బెట్టి ఆగస్ట్  కి ఈ సినిమా పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో రీమేక్ చిత్రం పూర్తి చేసి అక్టోబర్ నుంచి పొలిటికల్ టూర్ వెళ్ళాలని డిసైడ్ అయ్యారట. 2023 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీతో ఆయన స్టామినా ఏంటో ప్రపంచం మొత్తం చూడబోతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. 

అలాగే పవన్ కెరీర్‌లో ఇది మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. అంతేకాదు, ఇప్పటి వరకు కూడా పవన్ చేయని పాత్ర ఇది. టీజర్‌తోనే హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు పెరిగాయి. బాహుబలి సిరీస్ తర్వాత వార్ నేపథ్యంగా టాలీవుడ్‌లో పీరియాడిక్ సినిమాగా హరిహర వీరమల్లు రాబోతోంది. అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

ఇందులో పవన్‌కల్యాణ్‌ పేద ప్రజలకు అండగా నిలిచే బందిపోటు పాత్రలో కనిపిస్తారు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న సినిమా. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ ఛార్మినార్ సెట్‌, గండికోట సంస్థానం సెట్ నిర్మించారు. బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ ఇందులో ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడు.
 
ఇక పవన్ ఈ సినిమాల తర్వాత  హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించబోతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?