Nithiin:తేలేటట్లు లేదని...నితిన్ సినిమా పూర్తిగా ఆపేసారు

Surya Prakash   | Asianet News
Published : Jan 26, 2022, 12:17 PM IST
Nithiin:తేలేటట్లు లేదని...నితిన్ సినిమా పూర్తిగా ఆపేసారు

సారాంశం

ఈ ప్రాజెక్టు కోసం రూ.40 కోట్ల బడ్జెట్‌ను ఆయన నిర్మాతల ముందుంచారట. దీంతో నితిన్ మార్కెట్, దర్శకుడి క్యాపబిలిటీస్ వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు కోసం రూ.40 కోట్లు భారీ మొత్తం బడ్జెట్ పెట్టడం రిస్క్ అని నిర్మాతలు భావించారని సమాచారం


నితిన్ వంటి స్టార్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో  సినిమాలు సాధారణంగా ఆగవు. కానీ ఒక ప్రాజెక్టు మాత్రం బడ్జెట్ సమస్యలతో ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు పవర్ పేట.  నితిన్ తనతో  'చల్ మోహన్ రంగ' చిత్రం చేసిన దర్శకుడు కృష్ణ చైతన్యతో "పవర్ పేట" మొదలెట్టాలనుకున్నారు. కానీ అనుకున్న బడ్జెట్ కన్నా బాగా ఎక్కువ అవుతుందనే లెక్కలు తేలటంతో..ఆపేసినట్లు సమాచారం.

 వాస్తవానికి  ఈ చిత్రం ప్రారంభానికి ముందునుంచే పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. బడ్జెట్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. “పవర్ పేట” రెండు భాగాలుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేసారు. అందులోనూ ఇందులో నితిన్ 60 ఏళ్ల వృద్ధుడిగా ఛాలెంజింగ్ రోల్ లో కన్పించాల్సి ఉంది.  దానికి నితిన్ రెడీ అయ్యాడు.

ఈ ప్రాజెక్టు కోసం రూ.40 కోట్ల బడ్జెట్‌ను ఆయన నిర్మాతల ముందుంచారట. దీంతో నితిన్ మార్కెట్, దర్శకుడి క్యాపబిలిటీస్ వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు కోసం రూ.40 కోట్లు భారీ మొత్తం బడ్జెట్ పెట్టడం రిస్క్ అని నిర్మాతలు భావించారని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్టును నిలిపివేశారు.  

దాంతో ఈ దర్శకుడు కూడా తన నెక్ట్స్  చిత్రానికి వెళ్లినట్లు మేకర్స్ చెప్పారు. కృష్ణ చైతన్య ఇప్పుడు శర్వానంద్‌తో జతకట్టబోతున్నాడు మరియు దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఇంకా వేచి ఉంది. మరోవైపు శర్వానంద్‌ తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రంలో నటిస్తున్నారు.

 రీసెంట్ గా విడుదలైన 'మాస్ట్రో' చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించిన నితిన్ ప్రస్తుతం MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తన రాబోయే చిత్రం "మాచర్ల నియోజకవర్గం"లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి  హీరోయిన్ గా నటిస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?