ఆనీ మాస్టర్ కు మళ్ళీ కరోనా.. కావల్సిందే అన్ననెటిజన్.. సన్నీ బాబాను ప్రార్ధించిన కొరియోగ్రాఫర్.

Published : Jan 26, 2022, 11:51 AM ISTUpdated : Jan 26, 2022, 11:52 AM IST
ఆనీ మాస్టర్ కు మళ్ళీ కరోనా.. కావల్సిందే అన్ననెటిజన్.. సన్నీ బాబాను ప్రార్ధించిన కొరియోగ్రాఫర్.

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వరుసగా సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. అటు వెండితెరతో పాటు ఇటు బుల్లి తెరను కూడా కోవిడ్ వదిలిపెట్టడం లేదు. రీసెంట్ గా డాన్సింగ్ డాల్.. ఆనీమాస్టార్ కోవిడ్ బారిన పడ్డారు.

ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వరుసగా సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. అటు వెండితెరతో పాటు ఇటు బుల్లి తెరను కూడా కోవిడ్ వదిలిపెట్టడం లేదు. రీసెంట్ గా డాన్సింగ్ డాల్.. ఆనీమాస్టార్ కోవిడ్ బారిన పడ్డారు.

వెండితెర..బుల్లితెర అని లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. స్టార్ సెలబ్రిటీల దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ ల వరకూ అందరిని కోవిడ్ తగులు కుంటంది.లాస్ట్ టైమ్ వచ్చిన వాళ్లకు కూడా మరోసారి కోవిడ్ వదిలిపెట్టడం లేదు. ఈరోజు పొద్దునే మెగాస్టార్ చిరంజీవి తనకు మళ్ళీ కోవిడ్ వచ్చిందని ట్వీట్ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. మాస్క్ పెట్టుకుని.. టీకాలు వేయించుకోవాలన్నారు. ఇక తాజాగా డాన్స్ మాస్టర్ ఆనీ కూడా కరోనా బారిన పడ్డారు.

ప్రముఖ కొరియోగ్రఫర్.. బిగ్ బాస్ ఫేమ్ ఆనీ మాస్టార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. గత ఏడాది కూడా తనకు కోవిడ్ పాజిటీవ్ వచ్చిందని. తరువాత మళ్ళీ ఇప్పుడు థార్డ్ వేవ్ లో కూడా తను కోవిడ్ బారిన పడ్డట్టు అనౌన్స్ చేసింది. ఈ కరోనా ఏమైనా టైమ్ మెయింటేన్ చేస్తుందా..? క్వారంటైన్ చిరాకుగా ఉంది.. చాలా బోరింగా ఉంది అంటూ..ఆనీ మాస్టర్ ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీ రాశారు.

అయితే రెండోసారి కరోనా బారిన పడిన ఆనీ మాస్టర్ త్వరగా కోలుకోవాలి అంటూ కొంత మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమెపై ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెకు తగిన శాస్తి జరిగింది అంటూ విమర్షిస్తున్నారు. బిగ్ బాస్ లో సన్నీకి సపోర్ట్ చేయనందుకు నీకు కరోనా రావల్సిందే అంటూ తిట్టి పోస్తున్నారు. అయితే ఈ మెసేజ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఆనీ మాస్టార్ శేర్ చేశారు. నువ్వు ఇంకా ఎదగాలి అంటూ ఆ నెటిజన్ కు గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చారు. అంతే కాదు సన్నీ బాబా నాకు కోవిడ్ పోయేలా ఏదైనా చెయ్యెచ్చు కదా అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టారు ఆనీ మాస్టార్.

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?