
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం, సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పవన్ పాలిటిక్స్ లో కూడా ఉండడంతో చిత్ర పరిశ్రమలోనే కొందరి నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. పోసాని, రాంగోపాల్ వర్మ లాంటి వారు తరచుగా పవన్ ని విమర్శించడం చూస్తూనే ఉన్నాం. ఇక వర్మ అయితే తరచుగా పవన్ గురించి సెటైరికల్ పోస్ట్ లు పెడుతూనే ఉంటాడు.
తాజాగా వర్మ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ని కెలికే విధంగా ఒక ఫేక్ ఎడిట్ పోస్ట్ పెట్టాడు. ఈ ఫేక్ ఎడిట్ కోసం పవన్ కళ్యాణ్ వారాహి పూజలో ఉన్న ఫోటో ని వర్మ ఉపయోగించుకున్నాడు. పూజలో భాగంగా పవన్ కళ్యాణ్ కాషాయం కండువాని తన గుండెలపై కప్పుకుని ఉన్న ఫోటోని వర్మ ఎడిట్ చేసి పోస్ట్ చేయడం తో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ కండువాపై వర్మ.. తాను శివుడి రూపంలో ఉన్న పిక్ ని ఎడిట్ చేసి పెట్టాడు. ఎడిట్ చేసిన ఈ ఫోటోని వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. శివ శివ శివా అని కామెంట్ పెట్టాడు.
ఇలాంటి ఫేక్ ఎడిట్లు చేసి ఏం సాధించాలని అంటూ పవన్ ఫ్యాన్స్ రాంగోపాల్ వర్మని ప్రశ్నిస్తున్నారు. వర్మ పైత్యానికి ఇది పరాకాష్ట అంటూ పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వర్మ వైసిపి సపోర్టర్ గా మారి ఈ విధంగా పవన్ ని కెలికే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు నెటిజన్లలో ఎక్కువవుతున్నాయి.
వర్మ ప్రస్తుతం వైఎస్ జగన్ ని హైలైట్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యేలా పొలిటికల్ చిత్రం వ్యూహం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వివాదాస్పద పొలిటికల్ మూవీస్ చేసే వర్మ వ్యూహంతో ఇంకెత రచ్చ చేస్తాడో చూడాలి. పవన్ కళ్యాణ్ వైసిపిపై చేసే విమర్శలపై కూడా వర్మ సెటైరికల్ కామెంట్స్ తో పోస్ట్ లు చేయడం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు సమీపించే కొద్దీ వర్మ ఇంకెంతలా పవన్ ని టార్గెట్ చేస్తాడో అని నెటిజన్లు అంటున్నారు.