Chiranjeevi-Varma:చెప్పిన మాట వింటే ఆయన వర్మ ఎందుకు అవుతాడు?... చిరంజీవి విన్నపానికి అప్పుడే తూట్లు!

Published : Jan 13, 2022, 07:53 PM IST
Chiranjeevi-Varma:చెప్పిన మాట వింటే ఆయన వర్మ ఎందుకు అవుతాడు?... చిరంజీవి విన్నపానికి అప్పుడే తూట్లు!

సారాంశం

పరిశ్రమ అభ్యర్ధనల పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు చిరంజీవి (Chiranjeevi)తెలిపారు. అదే విధంగా... త్వరలో పరిష్కారం రానుంది, ఈ లోపు అందరూ సంయమనం పాటిస్తూ, ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేయకండి అంటూ పరిశ్రమ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. చిరంజీవి ఈ మాట చెప్పి నాలుగు గంటలు గడవలేదు వర్మ చిరంజీవి విన్నపానికి తూట్లు పొందడానికి సిద్ధమయ్యారు.


వివాదానికి వర్మ (Ram Gopal Varma) వరసకు తమ్ముడవుతాడు. దాని కోసం వర్మ రోజూ ఎవరినో ఒకరిని గెలుకుతాడు. ఈ సారి ఆయన ప్రమేయం లేకుండానే పెద్ద గొడవ ఆయన కాలికి తగిలింది. బాగా ట్రెండ్ అవుతున్న ఏపీ టికెట్స్ ధరల (AP Tickets Prices)రచ్చ వర్మకు తెగ నచ్చేసింది. ఇంకేముంది లేటైనా లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అసలు టికెట్స్ ధరల తగ్గింపు తన సమస్యగా భావించి పోరాటం మొదలుపెట్టాడు. ఏనాడు కూడా వేరొకరి ప్రయోజనాల కోసం వర్మ ఇలాంటి ఉద్యమాలు చేసింది లేదు. తనకు ఉపయోగం లేని కాంట్రవర్సీ ఏదైనా ఉంటే... జస్ట్ ఒక కామెంట్ చేసి వదిలేస్తాడు. 

ఈ సారి మాత్రం అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. చివరకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ కూడా అయ్యారు. ఇదిలా ఉండగా నేడు మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. సీఎం జగన్ స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారు. ఆయనకు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు పరిశ్రమకు, ప్రభుత్వానికి టికెట్స్ ధరల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన గురించి కూడా మాట్లాడారు. సీఎం జగన్ (CM YS Jagan)తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి... సంతృప్తి వ్యక్తం చేశారు. 

పరిశ్రమ అభ్యర్ధనల పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు చిరంజీవి (Chiranjeevi)తెలిపారు. అదే విధంగా...  త్వరలో పరిష్కారం రానుంది, ఈ లోపు అందరూ సంయమనం పాటిస్తూ, ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేయకండి అంటూ పరిశ్రమ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. చిరంజీవి ఈ మాట చెప్పి నాలుగు గంటలు గడవలేదు వర్మ చిరంజీవి విన్నపానికి తూట్లు పొందడానికి సిద్ధమయ్యారు. ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో సీఎం జగన్-చిరంజీవి భేటీపై విశ్లేషణ చేయనున్నారు. 

ఇక సదరు ఛానల్ ఈ డిబేట్ కి పెట్టిన హెడ్డింగ్ చూస్తే... వర్మ ఘాటు వ్యాఖ్యలు చేయడానికి సిద్ధమయ్యాడని చెప్పొచ్చు. నిజానికి కొందరికి సమస్య పరిష్కారం కంటే కూడా వివాదమే ఎక్కవ సంతోషం ఇస్తుంది. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే చూసి అందించే కొందరు... ఆ ఇద్దరు ఎక్కడ కాంప్రమైజ్ అయిపోతారో అని మధ్యలో పుల్లలు పెడతారు. వర్మ తీరు అలాగే ఉంది. వర్మ తీసే అడల్ట్ కంటెంట్ చిత్రాలకు, వాటి బడ్జెట్ కి టికెట్స్ ధరలు అసలు సమస్యే కాదు. కానీ వర్మ ఇది తన సమస్య అన్నంత తీరుగా ఏపీ ప్రభుత్వం పై దాడి చేస్తున్నారు. 

లేదు పరిశ్రమ వలన పెద్దవాడైన కృతజ్ఞతతో ఇలా ఋణం తీర్చుకుంటున్నాడు అనుకోవడానికి వర్మకు అసలు సెంటిమెంట్స్ ఉండవు. కేవలం నేను, నా వోడ్కా, నా శృంగారం అంటారు. తల్లి, చెల్లి అంటే సెంటిమెంట్ లేని వర్మ కళామతల్లి కోసం పోరాడుతున్నాడంటే నమ్మడం కష్టమే. దీంతో వర్మ చేస్తున్న ఈ పోరాటం సమస్య పరిష్కారం కోసమో, జటిలం చేయడానికో అర్థం కావడం లేదు. తనను పట్టించుకోని స్టార్ హీరోలపై వర్మ ఈ విధంగా కక్ష తీర్చుకోవాలని అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది. వర్మ నేటి డిబేట్ లో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూద్దాం...  

PREV
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?