Nidhhi Agerwal: ఆ ముగ్గురు స్టార్ హీరోలపై కన్నేసిన ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్

Published : Jan 13, 2022, 06:49 PM IST
Nidhhi Agerwal: ఆ ముగ్గురు స్టార్ హీరోలపై కన్నేసిన ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్

సారాంశం

నేడు గురువారం నిధి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సంధర్భంగా టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరోలు ఎవరో చెప్పారు నిధి. 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పాన్ ఇండియా ఆఫర్ పట్టేసి అందరికీ షాక్ ఇచ్చింది నిధి అగర్వాల్. అమ్మడు కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకున్నా ఇలాంటి క్రేజీ ఆఫర్ రావడం నిజంగా అదృష్టమే. తెలుగు తమిళ, హిందీ భాషల్లో కలిపి నిధి ఆరు సినిమాలు చేశారు. వీటిలో ఇస్మార్ట్ శంకర్ మాత్రమే క్లీన్ హిట్ గా నిలిచింది. దర్శకుడు పూరి మ్యాజిక్ వర్క్ అవుట్ కావడంతో నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకొని కూడా భారీ వసూళ్లు రాబట్టింది ఇస్మార్ట్ శంకర్. 

గత ఏడాది నిధి నటించిన తమిళ చిత్రాలు ఈశ్వరన్, భూమి విజయం అందుకోలేదు. ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రంతో ఓ పాటు తమిళ చిత్రం చేస్తున్నారు. కాగా మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన 'హీరో' సంక్రాంతి (Sankranthi 2022) బరిలో దిగింది. ఈ మూవీలో హీరోయిన్ గా నిధి నటిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 15న హీరో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. 

కాగా నేడు గురువారం నిధి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సంధర్భంగా టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరోలు ఎవరో చెప్పారు నిధి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun)తో నటించాలని ఉందని, అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అన్నారు. ఆల్రెడీ పవన్ తో జతకట్టే కోరిక హరి హర వీరుమల్లు చిత్రంతో తీరింది. దీంతో నిధి మిగతా టాలీవుడ్ స్టార్స్ పై కన్నేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. 

ఇక హీరో మూవీ ట్రైలర్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడిన నేపథ్యంలో ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి. ఒక మంచిరోజు మూవీతో దర్శకుడిగా మారిన శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. నాని-నాగార్జున హీరోలుగా దేవ్ దాస్ తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య శమంతకమణి పేరుతో ప్రయోగాత్మక చిత్రం రూపొందించారు. ఇక అశోక్ గల్లా సొంత బ్యానర్ లో హీరో తెరకెక్కుతుంది. దీంతో కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో రూపొందించారు. నిధి సైతం రెమ్యూనరేషన్ గట్టిగానే రాబట్టారని వినికిడి. 

కాగా నిధి (Nidhhi Agerwal)కోలీవుడ్ మన్మథుడు శింబుతో ఎఫైర్ నడుపుతున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో గత ఏడాది ఈశ్వరన్ విడుదలైంది. అప్పడే వీరిద్దరికీ జత కుదిరిందని... సంథింగ్ సంథింగ్ నడుస్తుందని వరుస కథనాలు వెలువడుతున్నాయి. శింబు ఇప్పటి వరకు నయనతార, హన్సిక, త్రిష లతో అఫైర్స్ నడిపారు. ఆయన లవర్స్ లిస్ట్ లో కొత్తగా నిధి పేరు వచ్చి చేరిందని కోలీవుడ్ వర్గాల బోగట్టా. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్