పవన్ ఫ్యాన్స్ ఏం చేయగలిగారు: వర్మ

Published : May 16, 2018, 04:31 PM IST
పవన్ ఫ్యాన్స్ ఏం చేయగలిగారు: వర్మ

సారాంశం

ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ తన మితిమీరిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ ను

ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ తన మితిమీరిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ ను కామెంట్ చేస్తూనే ఉన్నారు. శ్రీరెడ్డి విషయంలో కూడా పవన్ ను ఆయన అభిమానులను దూషిస్తూ వర్మ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఇంత ధైర్యంగా మరొకరిని దూషిస్తూ మాట్లాడే వర్మ దీనికి భయపడడా..? అనే అనుమానం చాలా మందికి కలుగుతుంటుంది. తాజాగా వర్మ తనను భయపెట్టిన సంఘటనలు, వ్యక్తుల గురించి ప్రస్తావించారు.

''ఇప్పటివరకు నన్ను భయపెట్టిన సంఘటనలు జరగలేదు. ఏ వ్యక్తి కారణంగా నేను భయపడలేదు. మన దగ్గర ఉన్నది పోతున్నప్పుడు మాత్రం భయం కలుగుతుంది. చాలా మంది నన్ను అడుగుతుంటారు ఏం చూసుకొని నీకింత ధైర్యం అని.. నిజానికి అది ధైర్యం కాదు అండర్ స్టాండింగ్'' అని వెల్లడించారు.

అలానే పవన్ అభిమానుల గురించి ప్రస్తావిస్తూ.. ''రాజాకీయ పార్టీలు ఇప్పటివరకు ఏమైనా చేశాయా? ఇదే విధంగా నేను దావూద్ ఇబ్రహీంను అనలేను కదా.. ఆయన్ను అంటే సైలెంట్ గా బుల్లెట్ నా మీదకు వస్తుందని తెలుసు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు నరికేస్తాం.. చంపేస్తాం అన్నారు కానీ ఏం జరిగింది..? కెమెరా ముందు ఉన్నంతవరనే వారి మాటలు. అది ఆఫ్ అవ్వగానే అందరూ మహేష్ బాబు సినిమాను వెళ్లుంటారు అంటూ నవ్వుతూ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Harikrishna: ఆ శక్తి ఉంటే తప్పకుండా నందమూరి హరికృష్ణని బతికిస్తా.. ఎలాగో చెబుతూ కీరవాణి ఎమోషనల్ కామెంట్స్
Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌