ఎమ్మెల్యేలపై దర్శకుడు వర్మ సెటైర్లు!

Published : Jun 18, 2019, 03:28 PM IST
ఎమ్మెల్యేలపై దర్శకుడు వర్మ సెటైర్లు!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేల వైఖరిపై మండిపడ్డారు. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేల వైఖరిపై మండిపడ్డారు. తనదైన శైలిలో వరుస ట్వీట్ లు పెడుతూ సెటైర్లు వేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తన, స్పీకర్ ల పనితీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

''అసెంబ్లీలో గంట మోగించడం తప్ప స్పీకర్ చేస్తోన్న పని ఇంకేమైనా ఉందా..? జస్ట్ ఆస్కింగ్'' అంటూ ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత అసెంబ్లీలో స్పీకర్ గంట మోగిస్తుంటే తనకు స్కూల్ లో బెల్ గుర్తుకొస్తోందని.. ఎందుకంటే ఎమ్మెల్యేల ప్రవర్తన స్కూల్ పిల్లల మాదిరి ఉందని కామెంట్ చేశారు.

అసెంబ్లీ సన్నివేశాలు ఒకరిపై ఒకరు అరుచుకోవడం, ఒకరినొకరు బెదిరించుకోవడం, గతం గురించి ఫిర్యాదులు చేసుకోవడం కోసమా..? లేదా ప్రజా సమస్యలు  చర్చించడం కోసమా..? జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుస ట్వీట్లు చేశారు.

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్