'జబర్దస్త్'కి అనసూయ బ్రేక్ ఇవ్వనుందా..?

By AN TeluguFirst Published 18, Jun 2019, 3:08 PM IST
Highlights

బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' కార్యక్రమానికి యాంకర్లుగా రష్మి, అనసూయ వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. 

బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' కార్యక్రమానికి యాంకర్లుగా రష్మి, అనసూయ వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ షోకి అనసూయ గ్యాప్ ఇవ్వనుందనే మాటలు వినిపిస్తున్నాయి. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి క్రేజ్ దక్కించుకున్న ఈ నటికి వెండితెరపై నటించే వరుస అవకాశాలు వస్తున్నాయి.

అయితే తనకు ప్రత్యేకంగా అనిపించే కథలను మాత్రమే ఎన్నుకుంటూ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం 'కథనం' అనే సినిమాలో నటిస్తోన్న ఈ బ్యూటీ పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ నేపధ్యంలో అటు జబర్దస్త్ షోకి ఇటు సినిమాలకి కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందట.

ఈ క్రమంలో 'జబర్దస్త్' షోకి కొంతకాలం పాటు గ్యాప్ ఇవ్వాలని భావిస్తోందట. సినిమాల కమిట్మెంట్స్ పూర్తి చేసుకొని ఆ తరువాత మళ్లీ 'జబర్దస్త్' షోలో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోందట. 'జబర్దస్త్' షోకి అనసూయ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.

తన అందం, మాటలతో అలరిస్తూ షోని రక్తి కట్టిస్తుంటుంది. అయితే తన కెరీర్ కి బూస్టప్ ఇచ్చిన 'జబర్దస్త్' షోని వదిలేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు ట్వీట్ లు చేస్తున్నారు.  

Last Updated 18, Jun 2019, 3:08 PM IST