#మీటూ పై వర్మ కామెంట్!

Published : Oct 20, 2018, 05:18 PM IST
#మీటూ పై వర్మ కామెంట్!

సారాంశం

బాలీవుడ్ - టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మీటూ అనే పదం వైరల్ గా మారింది. చాలా మంది నటీమణులు వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పేస్తున్నారు. 

బాలీవుడ్ - టాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మీటూ అనే పదం వైరల్ గా మారింది. చాలా మంది నటీమణులు వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పేస్తున్నారు. దీంతో వారికి స్టార్ యాక్టర్స్ కూడా మద్దతు పలుకుతుండగా మరికొంత మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. 

ఆ సంగతి అటుంచితే.. మీటూ ఉద్యమం పై ఎవరి తరహాలో వారు అభిప్రాయాలను తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా మీటూ పై కామెంట్ చేశాడు.రీసెట్ గా మీడియాతో మాట్లాడిన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి మొదట మాట్లాడారు. అనంతరం మీటూ ఉద్యమంపై ప్రస్తావన రాగానే ఒక్క మాటలో సమాధానం చెప్పేశారు.

ఇక నుంచి మగాళ్ళంతా ఒళ్ళు దగ్గరపెట్టుకొని నడుచుకుంటారని వర్మ సమాధానమిచ్చారు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ తో వర్మ హడావుడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రాజకీయం రంగు పూయవద్దని షూటింగ్ ఎక్కువగా తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే జరగనుందని వివరణ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద
Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన