తెలుగు ప్రజలను విడగొట్టిన ఘనత లక్ష్మీస్ ఎన్టీఆర్ దే!

Published : Mar 29, 2019, 12:38 PM IST
తెలుగు ప్రజలను విడగొట్టిన ఘనత లక్ష్మీస్ ఎన్టీఆర్ దే!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాలి. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాలి. అయితే ఏపీలో ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నారు. ఏపీ హైకోర్టు ఇప్పట్లో సినిమా విడుదల కాకూడదంటూ వివరణ ఇచ్చింది.

దీంతో ఆంధ్ర ప్రజలకు ఈ సినిమా చూసే అవకాశం లేకపోవడంతో వర్మ ఎమోషనల్ అయ్యాడు. ''ప్రప్రధమంగా తెలుగు  ప్రజలను విడగొట్టిన ఘనత దురదృష్టవశాత్తు, లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దక్కింది'' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

''కోర్ట్ ఆర్డర్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో తప్ప తెలంగాణలోనూ ఇంకా ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లందరూ సినిమా చూడొచ్చు కానీఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేరు. హత విధి'' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు. 

అయితే ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆంధ్ర యువత సగం హైదరాబాద్ లోనే ఉన్నారని వాళ్లంతా సినిమా కచ్చితంగా చూస్తారంటూ వర్మకి భరోసా ఇస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు