'RRR' పై లేటెస్ట్ అప్డేట్.. తారక్ ట్వీట్!

Published : Mar 29, 2019, 10:19 AM IST
'RRR' పై లేటెస్ట్ అప్డేట్.. తారక్ ట్వీట్!

సారాంశం

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న భారీ చిత్రం 'RRR'. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన భారీ షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు. 

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న భారీ చిత్రం 'RRR'. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన భారీ షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు. దీనికోసం తారక్ గుజరాత్ లోని వడోదర నగరానికి వెళ్తున్నారు.

ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. విమాన టికెట్ ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. 'RRR' భారీ షెడ్యూల్ కోసం బయలుదేరుతున్నా అంటూ తారక్ ట్వీట్ చేశాడు.

ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు 'హ్యాపీ జర్నీ అన్నా.. మాకు ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉండు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోయిన్లు కూడా జాయిన్ అవుతారని సమాచారం.

ఇక సినిమా విషయానికొస్తే.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. 2020 జూన్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?