అసలు వర్మ చేసిన అవమానాలతో పోల్చితే గరికపాటి వారిదెంత!

Published : Oct 13, 2022, 01:40 PM IST
అసలు వర్మ చేసిన అవమానాలతో పోల్చితే గరికపాటి వారిదెంత!

సారాంశం

రామ్ గోపాల్ వర్మ రెండు రోజులుగా అవధాని గరికపాటి నరసింహారావును టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా వేదికగా ఆయన్ని ఏకిపారేస్తున్నారు. పలు సందర్భాల్లో గరికపాటి మాట్లాడిన విషయాలను బయటికి తీస్తూ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. 

వర్మ చర్యలు ఊహాతీతం. ఆయన ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. ఎవరిని పొగుడుతాడో? ఎవరిని తెగుడుతాడో? అంచనా వేయలేం. ఇటీవల చిరంజీవి-గరికపాటి మధ్య ఓ వివాదం చోటు చేసుకుంది. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులతో ఫోటోలు దిగడాన్ని గరికపాటి నరసింహారావు తప్పుబట్టారు. ఆయన ప్రసంగం చేస్తున్న సమయంలో మహిళా అభిమానులతో చిరంజీవి సెల్ఫీలు దిగుతుండగా... గరికపాటి అసహనానికి గురయ్యారు చిరంజీవి ఫోటో షూట్ ఆపకపోతే నేను ప్రసంగించకుండా వెళ్లిపోతానని మైక్ లో ఓపెన్ గా చెప్పారు. 

అది చిరంజీవికి జరిగిన అవమానంగా అభిమానులు భావించారు. తమ్ముడు నాగబాబుతో పాటు చోటా కె నాయుడు, దర్శకుడు బాబీ వంటి ప్రముఖులు గరికపాటిని ఉద్దేశిస్తూ పరోక్షంగా, ప్రత్యక్షంగా సెటైర్స్ వేశారు. అభిమానులు సోషల్ మీడియాలో  గరికపాటికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. వివాదం సద్దుమణుగుతున్న సమయంలో వర్మ ఎంటర్ అయ్యాడు. చిరంజీవికి మద్దతుగా గరికపాటికి వ్యతిరేకంగా వరుస కామెంట్స్ పోస్ట్ చేశారు. 

గరికపాటిపై వర్మ పోరాటం, వ్యతిరేకత కామెంట్స్ తో ఆగలేదు.. ఆయన గత వీడియోలు బయటికి తీసి వ్యక్తిత్వం పై దాడి చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆడవాళ్ళ వస్త్రధారణ, శరీరంపై గరికపాటి చేసిన కామెంట్స్ బయటపెడుతూ... స్త్రీవాదులు ఆయన మాటలు ఖడించరా? మీ అభిప్రాయం ఏమిటంటూ.. తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుతున్నారు. 

అంతా బాగానే ఉంది... ఇదంతా వర్మ చిరంజీవిపై ప్రేమతో చేస్తున్నాడా? లేక గరికపాటిపై కోపంతో చేస్తున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇంత కంటే ఎక్కువగా చిరంజీవిని వర్మ అవమానించాడు. పవన్, చిరంజీవిలను కించపరిచేలా ఏకంగా సినిమాలే తీశాడు. అల్లు అర్జున్ ని లేపుతూ... చిరంజీవి, పవన్, చరణ్ నథింగ్ అంటూ ట్వీట్స్ చేశారు. ఒకటేంటి వందల సందర్భాల్లో చిరంజీవిని ఆయన ఫ్యామిలీని వర్మ తక్కువ చేయడం జరిగింది. 

అందుకే వర్మ అంటే మెగా ఫ్యాన్స్ కి పిచ్చ కోపం. వర్మపై వారు భౌతిక దాడులకు కూడా దిగారు. వర్మ ఆఫీస్ కి వెళ్లి పవన్ ఫ్యాన్స్ గందరగోళం చేశారు. బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు.ఇక చిరంజీవిని ఆయన కుటుంబాన్ని వర్మ అవమానించినంతగా ఎవరూ అవమానించలేదు. గరికపాటి ఏదో ఆవేశంలో అసహనం ప్రదర్శించిన దానికే వర్మ తెగ తెంచుకుంటున్నాడు. ఈ పరిణామాలు గమనిస్తున్న జనాలు ఇంకంతే ఎక్కువగా చిరంజీవిని అవమానించావుగా వర్మా? అని ప్రశ్నిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhanush: మృణాళ్ కంటే ముందు ధనుష్ ఇంత మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడా?
Allari Naresh: అల్లరి నరేష్‌ ఇంట్లో విషాదం.. తాత కన్నుమూత.. కారణం ఇదే