శ్రీదేవి జీవితాంతం మనశ్శాంతి లేకుండానే బతికింది : వర్మ

First Published Feb 27, 2018, 3:15 PM IST
Highlights
  • శ్రీదేవి జీవితంలోని మరో కోణం గురించి వివరించాడు వర్మ
  • శ్రీదేవి తండ్రి చనిపోయాక వాళ్ల కుటుంబం చాలా కష్టాలు ఎదుర్కొంది
  • బోనీ కపూర్ అప్పుల్లో మునిగిన స్థితిలో శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు

శ్రీదేవి జీవితంలోని మరో కోణం గురించి వర్మ వివరిస్తూ ఈ రోజు ఒక సుదీర్ఘ లేఖను తన లాంటి అభిమానుల కోసం విడుదల చేశాడు. అందులో వర్మ చెప్పిన కొన్ని విషయాలు షాకింగ్ అనిపిస్తాయి.సినిమా వాళ్లకేంటి.. కోట్లకు కోట్లు పారితోషకాలు.. లగ్జీరియస్ లైఫ్ అనుకుంటాం కానీ.. అందరి జీవితాలూ జనాలు అనుకున్నంత హ్యాపీగా ఉండవు. ఇందుకు శ్రీదేవి జీవితమే ఉదాహరణ అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.



ఐదేళ్ల వయసు నుంచే సినీ రంగంలో కొనసాగుతున్న శ్రీదేవి.. గాజు గోడల మధ్యే జీవించిందని.. ఆమె చాలా సున్నిత మనస్కురాలని.. ఆమె జీవితంలో ఏ రోజూ ప్రశాంతత లేదని వర్మ తెలిపాడు. శ్రీదేవి తండ్రి చనిపోయాక వాళ్ల కుటుంబం చాలా కష్టాలు ఎదురైందని .. శ్రీదేవి తల్లికి సరైన అవగాహన లేక ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి మోసపోయిందని.. తర్వాత మరో సందర్భంలో శ్రీదేవి సోదరి శ్రీలతకు ఆస్తులన్నింటినీ రాసిచ్చేసిందని.. దీంతో శ్రీదేవి ఒక దశలో చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి వచ్చిందని వర్మ తెలిపాడు.
 

పెళ్లి తర్వాత కూడా శ్రీదేవి ఏమంత సంతోషంగా లేదని.. మోనా నుంచి బోనీని విడగొట్టిందన్న కారణంతో బోనీ తల్లి శ్రీదేవిపై చేయి కూడా చేసుకుందని వర్మ వెల్లడించాడు. అందం కాపాడుకోవడం కోసం శ్రీదేవి కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుందని.. దాని ప్రభావం గత ఐదారేళ్లలో శ్రీదేవిని చూసిన వాళ్లకు స్పష్టంగా తెలుస్తుందని.. గత కొన్నేళ్లుగా శ్రీదేవి తన కూతుళ్ల కెరీర్ గురించి ఆలోచిస్తూ గడిపిందని.. మొత్తంగా శ్రీదేవి తన జీవితాంతం అశాంతి మధ్యనే బతికిందని.. చనిపోయాక అయినా ఆమెకు శాంతి లభిస్తుందేమో అన్నది తన ఆశ అని వర్మ అన్నాడు.

click me!